అంగస్తంభన సమస్యకు నిజంగా కరోనా కారణమా? తెలుసుకోవడం ఎలా?

Coronavirus-related Erectile Dysfunction : ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి. వ్యాక్సిన్లు వచ్చేంతవరకు కనీసం కరోనా బారినపడకుండా ప్రతిఒక్కరూ ముఖానికి మాస్క్ తో పాటు భౌతిక దూరాన్ని తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక అది ఏదైనా అవయవాలపై దాడి చేయొచ్చు. ఊపిరితిత్తులు, మెదడు మాత్రమే కాదు.. శరీరంలో ఏ భాగమైనా కరోనా ప్రభావానికి గురికావొచ్చు.. అయితే కరోనా సోకినవారిలో లక్షణాలు ఒక్కొలా కనిపిస్తుంటాయి. చాలావరకు కరోనా కేసుల్లో ఒకే మాదిరి లక్షణాలు కనిపించినప్పటికీ.. ఎక్కువ కరోనా కేసుల్లో మాత్రం అంగస్తంభన సమస్యకు దారితీయొచ్చునని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. అంగస్తంభన సమస్యతో కరోనాకు సంబంధం ఉందని ఇప్పటికే పలు కరోనా కేసుల రిపోర్టులో తేలింది. కరోనా నుంచి కోలుకున్నవారిపై పరిశోధకులు లోతుగా అధ్యయనం చేశారు.
వారిలో ఎక్కువగా లైంగిక సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు నిర్ధారించారు. ఈ అధ్యయనాన్ని జూలై నెలలో జనరల్ ఆఫ్ Endocrinological Investigationలో ప్రచురించారు. కరోనా సోకిన తర్వాత చాలామంది బాధితులు అంగస్తంభన సమస్యతో బాధపడ్డారని అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి కరోనా వైరస్ ప్రపంచానికే కొత్త వైరస్.. దీని ప్రభావం దీర్ఘకాలికంగా మనుషులపై ఎలా ఉంటుంది అనేదానిపై ఇంకా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు, పరిశోధనలను పరిశీలన చేస్తే.. సైద్ధాంతికంగా కరోనాతో అంగస్తంభన సమస్యకు సంబంధం ఉన్నట్టు ఎక్కడా కచ్చితమైన డేటా అందుబాటులో లేదు. కానీ, కొందరు నిపుణులు మాత్రం కరోనా పేషెంట్లలో అరుదైన లక్షణంగా చెబుతున్నారు. కొంతకాలానికి ఈ లక్షణం తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు. కరోనా వైరస్ సోకినవారిలో ఎవరిలోనైనా అంగస్తంభన సమస్య అనేది సాధారణ సమస్యగా ఉండే అవకాశం ఉందని కాలిఫోర్నియాలోని యూరాలిస్ట్ Judson Brandeis చెబుతున్నారు.
రక్తప్రసరణలో సమస్యలు, అంగస్తంభనకు కారణం కావొచ్చు :
కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రక్త కణాలపై దాడి చేస్తుంది. దాంతో రక్త ప్రసరణలో ఇబ్బందులు రావొచ్చు. చాలామంది కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు కనిపించాయి. కొంతమందిలో ఊపిరితిత్తులు లేదా కిడ్నీలు లేదా నోటిలో పళ్లు రాలిపోవడం వంటి అనారోగ్య సమస్యలకు దారితీసిందని డేటాలో వెల్లడైంది. అలాగే అంగస్తంభన సమస్యకు రక్త ప్రసరణలో మార్పులే కారణమై ఉండొచ్చునని యూరాలాజిస్ట్ క్రిస్టోపర్ కైల్ తెలిపారు. కరోనా సంబంధిత వస్క్యూలేర్ సమస్యలకు దారితీస్తుందని చెప్పారు.
అంగస్తంభన సమస్య.. గుండెజబ్బు లక్షణంగా కావొచ్చు :
రక్తప్రసరణలో సమస్యలు వచ్చాయంటే.. అది హృదయ సంబంధిత అనారోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.. కరోనా సోకిన చాలామంది బాధితుల్లో దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. endothelial dysfunction అనే గుండె అనారోగ్య సమస్యకు కారణమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు.. ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైన డయాబెటిస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్ వంటివి కూడా పురుషుల్లో అంగస్తంభన సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనాతో మానసికంగానే కాదు.. లైంగిక సమస్యలు కూడా :
కరోనా వచ్చినవారిలో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. భౌతికంగానూ సంబంధం ఉంటుంది. అలాగే లైంగిక సంబంధమైన కోరికలు తగ్గిపోవడం, మూడీగా ఉండటం వంటి అనేక రుగ్మతలకు దారితీస్తుందని అధ్యయనంలో తేలింది. అంగస్తంభన సమస్య అనేది కరోనా బాధితుల్లో ఎంతకాలం ఉంటుంది అనేదానిపై స్పష్టత లేదు. అయినప్పటికీ ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.