Hair loss With Helmet: హెల్మెట్ వాడితే జుట్టు ఊడుతుందా.. చాలా మందికి తెలియని విషయం.. నిపుణులు చెప్తున్నది ఇదే
హెల్మెట్, టోపీ లాంటివి వాడటం వల్ల జుట్టు ఎలాంటి జుట్టు సమస్యలు రావని చెప్తున్నారు. బట్టతల వచ్చే అవకాశం కూడా అసలే లేదట.

Hair loss
ప్రస్తుత జనరేషన్ లో హెల్మెట్ వాడకం అనేది తప్పనిసరి అయిపోయింది. లేదంటే ప్రాణాలకు రక్షణ లేకుండాపోతుంది. చాలా మంది హెల్మెట్ వాడటం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకున్నారు. అందుకే, ప్రభుత్వం కూడా బైక్ డ్రైవింగ్ లో హెల్మెట్ తప్పనిసరి చేసింది. అయితే చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే హెల్మెట్ ఎక్కువగా వాడటం వల్ల జుట్టు రాలుతుందా అని. దాంతో.. బట్టతల వస్తుందేమో అన్న భయంతో హెల్మెట్ వాడకాన్ని తగ్గిస్తున్నారు. కానీ, ఇది ఇంకా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, హెల్మెట్ ఎక్కువగా వాడటం వల్ల నిజంగా జుట్టు రాలుతుందా? బట్టతల వస్తుందా? నిపుణులు ఏమంటున్నారు అనేది ఇప్పడు తెలుసుకుందాం.
నిపుణులు చెప్తున్నది ఇదే:
ఈ విషయంలో నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే.. హెల్మెట్, టోపీ లాంటివి వాడటం వల్ల జుట్టు ఎలాంటి జుట్టు సమస్యలు రావని చెప్తున్నారు. బట్టతల వచ్చే అవకాశం కూడా అసలే లేదట. నిజానికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు సమస్యను అరికట్టవచ్చట. ఎలా అంటే.. జుట్టు సమస్యలకు బయట నుంచి వచ్చే ప్రధాన కారణాలు దుమ్ము, ధూళి, సూర్యకాంతి, పొగ. వీటి ప్రభావం జుట్టుపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. హెల్మెట్ ధరించడం వల్ల వీటి నుంచి రక్షణ లభిస్తుంది. కాబట్టి, హెల్మెట్ వాడితే జుట్టు రాలుతుంది అనుకోవడం భ్రమే అని చెప్తున్నారు. జుట్టు రాలడం అనేది హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉందట. జుట్టును బలోపేతం అవడానికి దానికి అవసరమైన పోషకాలు సరిగా అందాలి. శరీరంలో పోషకాల కొరత కారణంగా కూడా జుట్టు కుదుళ్లు బలహీనపడతాయట. తలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల మూలాలపై మురికి చేరడం వల్ల కూడా జుట్టు రాలడం మొదలవుతుంది.
హెల్మెట్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి:
- హెల్మెట్ పెట్టుకునేప్పుడు తలకు క్లాత్ పెట్టండి. ఇది చెమటను పీల్చుకుంటుంది. దానివల్ల దురద తగ్గుతుంది.
- జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ వాడకండి. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడి చుండ్రు సమస్య వస్తుంది.
- కనీసం వారానికోసారైనా తప్పకుండా హెల్మెట్ లోపల వైపు శుభ్రం చేసుకోవాలిక్.
- హెల్మెట్ ను ఎప్పుడు గాలి తగిలే చోట పెట్టుకోవాలి. లేదంటే ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంది.
- సాధ్యమైనంతవరకు ఎవరి హెల్మెట్ వారు వాడటమే మంచిది. ఎందుకంటే వారి జుట్టు సమస్య మీకు కూడా అంటుకునే అవకాశం ఉంటుంది.