వ్యాక్సిన్ వచ్చినా మాస్క్ లు తీయడానికి మరో యేడాది, 2021 చివరకు ఇంతే

COVID-19 vaccine: వ్యాక్సిన్‌లు అనుకున్నంత వేగంగా రాకపోవడం, కరోనాకు అడ్డకట్టపడకపోవడంతో డా. ఆంథోనీ ఫాసీ కీలక ప్రకటన చేశారు. 2021 చివరి వరకు ప్రపంచం సాధారణ స్థాయికి రాకపోవచ్చునని వ్యాఖ్యానించారు. కాకపోతే ఈ యేడాది అంతానికి వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కాకపోతే ఒకటే కండీషన్. వ్యాక్సిన్ అన్నింటిని సమీకరించి, మెజార్టీ ప్రజలకు పంపిణీ చేసి, వ్యాక్సిన్ వేయడానికి 6నెలల నుంచి యేడాది వరకు పడుతుందని అన్నారు. అంటే… 2021 వేసవికాని, లేదంటే…యేడాది చివరకు టైం పడుతుంది.
అంటే వ్యాక్సిన్ వచ్చినా అందరికీ అందుబాటులోకి వస్తేకాని, కరోనా కట్టడి చేయలేం. కొందరు వేసుకున్నంత మాత్రానా కరోనాను జయించినట్లు కాదు. దానివల్ల సామాజిక అంతరాలు, వైషమ్యాలు పెరగడం ఖాయం. అందుకే అందరికీ వ్యాక్సిన్‌ను అందించడానికి ప్రయత్నంమీదనే కరోనా కట్టడి ఆధారపడి ఉంటుందని తేల్చేశారు డాక్ట్ ఫాజీ.
కోవిడ్ కన్నా ముందునాటి పరిస్థితులు మళ్లీ రావాలంటే 2021 ఎండింగ్ వరకు ఎదురుచూడాల్సిందేనని ఫాసీ అంచనావేస్తున్నారు.