కంటివెలుగు: కోటి 54లక్షల మందికి కంటి పరీక్షలు

  • Published By: chvmurthy ,Published On : March 2, 2019 / 05:55 AM IST
కంటివెలుగు: కోటి 54లక్షల మందికి కంటి పరీక్షలు

Updated On : March 2, 2019 / 5:55 AM IST

హైదరాబాద్: అంధత్వరహిత తెలంగాణ ఏర్పాటు దిశగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు  కోటి 54 లక్షల 8 వేల 668 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రజలందరికీ కంటిచూపు ఉండాలని, ఎవ్వరూ  కూడా కంటిచూపు కోల్పోవద్దన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ అధ్వర్యంలో విస్తృతంగా కంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నది.

కార్యక్రమం ప్రారంభమైన నాటినుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 9,768 గ్రామాల్లో, మున్సిపాలిటీల పరిధిలోని 893 వార్డుల్లో నిర్వహించిన కంటి వైద్యశిబిరాల్లో1,54,08,668 మందికి కంటిపరీక్షలు చేయగా.. వీరిలో  22 లక్షల 84 వేల 751 మందికి కళ్లద్దాలు అందజేశారు.