ప్రపంచానికి 200 కోట్ల కోవాక్స్ టీకా డోసులు

ప్రపంచానికి 200 కోట్ల కోవాక్స్ టీకా డోసులు

Updated On : December 20, 2020 / 7:11 AM IST

Global Partnership Covax Vaccine Doses : కోవాక్స్ టీకాను ప్రపంచ దేశాలకు అందించడానికి కోవాక్స్‌ రెడీ అయింది. ప్రపంచ దేశాల కోసం 200 కోట్ల టీకా డోసులను అందించేందుకు అంతర్జాతీయ వ్యాక్సిన్ భాగస్వామి కోవాక్స్ ముందుకొచ్చింది.

కరోనా వ్యాక్సిన్‌ కోసం డబ్బు వెచ్చించలేని పేద దేశాలకు కోవాక్స్ వ్యాక్సిన్ సాయం అందించనుంది. ఐక్యరాజ్యసమితి ద్వారా రూ.2 కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు పొందిన వ్యాక్సిన్లను 2021లో దాదాపు 92 దేశాలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ప్రపంచ ఆరోగ్యంలో మైలు రాయిగా పేర్కొన్నారు. టీకా ఇంకా ప్రారంభం కాలేదని, త్వరలోనే అవుతుందని అన్నారు. వ్యాక్సిన్‌ రేసుల్లో ముందున్న అన్ని సంస్థలతోనూ డోనార్ల ఆర్థిక సాయంతో చర్చలు జరిపి వ్యాక్సిన్లను సేకరించారు. ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు అక్కడి జనాభా ప్రకారం కోవాగ్జిన్ టీకాను అందించనున్నారు.