Bullet Coffee Benefits: మీరు బుల్లెట్ కాఫీ తాగారా? అద్భుతమైన ఆరోగ్యం.. మీరు కూడా ఇలా ట్రై చేయండి.

Bullet Coffee Benefits: ఈ కాఫీలో ఉండే MCT ఆయిల్ శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్లు కాకుండా కొవ్వు ఆధారిత ఇంధనంగా పనిచేస్తుంది

Bullet Coffee Benefits: మీరు బుల్లెట్ కాఫీ తాగారా? అద్భుతమైన ఆరోగ్యం.. మీరు కూడా ఇలా ట్రై చేయండి.

Health benefits of Bullet Coffee

Updated On : June 24, 2025 / 4:46 PM IST

ప్రస్తుతం యువత కొత్తవాటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. మార్కెట్ లోకి ఏది కొత్తగా వచ్చినా అది ఫాలో ఐపోతున్నారు. అలా ఇప్పుడు మార్కెట్ లో వచ్చిన కొత్తరకం కాఫీనే బుల్లెట్ కాఫీ. ఇది కొత్తరకమే కాదు ఎంతో ఆరోగ్యం కూడా. ఇంతకీ ఈ బుల్లెట్ కాఫీని ఎలా తాయారు చేస్తారు అనుకుంటున్నారా? సింపుల్.. దీనిని బ్లాక్ కాఫీలో నెయ్యిని కలిపి చేస్తారు. కాఫీకి నెయ్యి ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వు తోడవడంతో ఇది ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కేవలం ఇదే కాదు బుల్లెట్ కాఫీతో ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Also Read:సముద్రపు దోసకాయ ఒక దివ్యౌషధం.. గుండె నుండి క్యాన్సర్ వరకు అన్నీ సమస్యలు మాయం

బులెట్ కాఫీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

శక్తి, స్టామినా పెరుగుతుంది: ఈ కాఫీలో ఉండే MCT ఆయిల్ శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్లు కాకుండా కొవ్వు ఆధారిత ఇంధనంగా పనిచేస్తుంది. అందుకే ఇది ఫిట్‌నెస్ ప్రేమికులు ఎక్కువగా తాగుతారు.

మెదడు చురుగ్గా పని చేస్తుంది: బుల్లెట్ కాఫీలో ఉండే MCT ఆయిల్ మెదడు పనితీరును పెంచుతుంది. ఇది కీటో డైట్ చేసే వారికి ఫోకస్ పెంచే కాఫీగా ప్రసిద్ధి చెందింది.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కు మద్దతు: బులెట్ కాఫీ తాగితే ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల ఆకలి ఉండదు. అందుకే ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో బ్రేక్‌ఫాస్ట్ బదులుగా తాగవచ్చు. దాంతో ఇది కొవ్వును శక్తిగా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంపయోగపడుతుంది.

బరువు తగ్గేందుకు సహాయపడుతుంది: బుల్లెట్ కాఫీ కొవ్వుల ఆధారంగా శక్తిని అందిస్తుంది కాబట్టి బాడీ ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఎక్కువ కాలం తిన్నట్లే ఉన్న అనుభూతి ఉంటుంది కాబట్టి ఆటిమేటిక్ గా బరువు తగ్గుతుంది. Also Read: ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా.. అయితే వీటిని బాగా తినండి.. మొత్తం క్లీన్ అవుతుంది

డయాబెటిస్ కంట్రోల్: ఈ కాఫీలో ప్రోటీన్, కొవ్వులు మాత్రమే ఉంటుంది. చక్కెరలు ఉండవు. కాబట్టి, ఇన్సులిన్ స్పైక్స్ రాకుండా జాగ్రత్త పడుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మెరుగ్గా పనిచేస్తుంది.