Sea Cucumber Benefits: సముద్రపు దోసకాయ ఒక దివ్యౌషధం.. గుండె నుండి క్యాన్సర్ వరకు అన్నీ సమస్యలు మాయం

Sea Cucumber Benefits: సముద్రపు దోసకాయ. ఇది సముద్ర జలాల్లో నివసించే ఒక జీవి. దీనిని సీ కుకుంబర్ అని కూడా అంటారు.

Sea Cucumber Benefits: సముద్రపు దోసకాయ ఒక దివ్యౌషధం.. గుండె నుండి క్యాన్సర్ వరకు అన్నీ సమస్యలు మాయం

Sea Cucumber health benefits

Updated On : June 24, 2025 / 3:55 PM IST

సముద్రపు దోసకాయ. ఇది సముద్ర జలాల్లో నివసించే ఒక జీవి. దీనిని సీ కుకుంబర్ అని కూడా అంటారు. చూడటానికి దోసకాయలాగా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఈ జీవి గురించి మనకు తెలియకపోవచ్చు కానీ, చైనా, జపాన్, కొరియా లాంటి ఆసియా తీరా ప్రాంతాల వాళ్లకు మాత్రం బాగా తెలుసు. ఇది వారి రోజువారీ ఆహారంలో భాగంగా ఉంది. చుదయానికి చాలా అసహ్యంగా కనిపించే ఈ జీవి మనిషికి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుందట. గుండె సమస్యల నుండి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలను నయం చేయడంలో ఈ జీవి అద్భుతంగా ఉపయోగపడుతుందట. Also Read: ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా.. అయితే వీటిని బాగా తినండి.. మొత్తం క్లీన్ అవుతుంది

సముద్రపు దోసకాయలో లభించే పోషక విలువలు:

  • ప్రోటీన్: శరీర కండరాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
  • ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • విటమిన్లు: నయాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ A, B12 పుష్కలంగా లభిస్తాయి.
  • ఖనిజాలు: కాల్షియం, మ్యాగ్నీషియం, జింక్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.
  • యాంటీఆక్సిడెంట్లు: హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి. క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.

సముద్రపు దోసకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

  • యాంటీక్యాన్సర్ లక్షణాలు: సముద్రపు దోసకాయలో ఉండే కొన్ని జీవరసాయనాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుంది. దీనిపై అనేక ప్రయోగాలు కూడా జరిగాయి.
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: సముద్రపు దోసకాయలో ఉండే ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు పీచు పదార్థాలు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనికి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే లక్షణం ఉంది. Also Read: సీసీఎఫ్ టీ.. జీర్ణ సమస్యలకు అద్భుత ఔషధం.. ఒకసారి ట్రై చేయండి
  • ఎముకల బలాన్ని పెంచుతుంది: ఈ జీవిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మగ్నీషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి.
  • యాంటీ మైక్రోబయల్ లక్షణాల: ఈ జీవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులపై యుద్ధం చేసే గుణాలను కలిగి ఉంటుంది. కాబట్టి, మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
  • ఆంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు: ఈ జీవిలో ఉండే యాంటి-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.
  • ఇమ్యూనిటీ బలపడుతుంది: ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్స్, బ్యాక్టీరియాలు వలన వచ్చే రోగాలను నయం చేస్తుంది.