Ghee Benefits: అబ్బా.. నెయ్యి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా.. కానీ వీళ్ళు తినకూడదట.
ఉదయం నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహరం త్వరగా జీర్ణమవుతుందని, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.

Health benefits of Ghee
మనం తినే ఆహరం ఏదైనా సరే అందులో నెయ్యి ఉంటే వచ్చే ఆ మజానే వేరు. చాలా మంది ప్రతీ ఆహరంలో నెయ్యిని వేసుకొని తింటారు. అయితే నెయ్యి కేవలం టేస్ట్ గురించి మాత్రమే కాదు.. దీనివల్ల చాలా రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట. నెయ్యి విషయంలో చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే.. ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది అని అనుకున్నారు. కానీ, అలాంటిదెమ్ ఉండదని అంటున్నారు నిపుణులు. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడంలో నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. మరి నెయ్యి తినడం వల్ల వచ్చే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆహరం త్వరగా జీర్ణమవుతుందని, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. నెయ్యి శరీరంలో మంచి కొలెస్టరాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు కాలేయంలో కీటోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల శక్తి లభించడంతోపాటు గ్లూకోజ్‌పై ఆధారపడడం తగ్గుతుంది.
నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ శోషరస వ్యవస్థను ప్రేరేపిస్తుందట. దీనివల్ల రోగనిరోధక శక్తి మెరుగుపరడంతో పాటు వ్యాధికారకాల నుంచి రక్షణ పెరుగుతుందట. పరగడుపునే నెయ్యి తినడం వల్ల కొన్ని అంటువ్యాధులు దరి చేరవట.
నెయ్యి ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు కాల్షియం సమీకరణను ప్రోత్సహిస్తాయి. బోలు ఎముకల వ్యాధిని, ఎముక పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. నెయ్యిలో ఉన్న స్టార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ల వాపును తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది.
నెయ్యి తినడం వల్ల శరీరంలో కఫం పెరిగి జలుపు, ఫ్లూ వంటి సమస్యలు దరిచేరవు. ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా నెయ్యి రక్షణ ఇస్తుంది.