Kiwi Fruit Benefits: వర్షాకాలంలో కివి పండు తప్పకుండా తినండి.. ఎందుకో తెలుసా?

Kiwi Fruit Benefits: వర్షాకాలం వచ్చిందంటే జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వంటి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతాయి.

Kiwi Fruit Benefits: వర్షాకాలంలో కివి పండు తప్పకుండా తినండి.. ఎందుకో తెలుసా?

Health benefits of eating kiwi fruit in monsoon

Updated On : July 4, 2025 / 3:57 PM IST

వర్షాకాలం వచ్చిందంటే జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వంటి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి, ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని బలపరుచుకోవడం అత్యంత అవసరం. మన డైట్‌లో తక్కువకాలంలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందించే పండ్లలో కివి (Kiwi fruit) మొదటి స్థానంలో ఉంటుంది. దీనిలో ఆరోగ్యకరమైన చాలా పోషకాలు ఉంటాయి. అందుకే వర్షాకాలానికి ఇది ‘సూపర్ ఫ్రూట్’ అనే అంటారు. మరి వర్షాకాలంలో కివి ఫ్రూట్ ఎందుకు తినాలి? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో కివి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1.ఇమ్యూనిటీ బూస్టర్:
వర్షాకాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటివి రావడం చాలా సాధారణం. కివి పండులో ఉండే అధిక విటమిన్ C తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని వైరస్‌లతో పోరాడేలా చేస్తుంది. ఒక కివి పండు ఒకరోజుకు అవసరమయ్యే విటమిన్ C అందిస్తుంది.

2. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
వర్షాకాలంలో వచ్చే రోగాలు జీర్ణ వ్యవస్థను పాడుచేస్తాయి. కివిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. మలబద్దకాన్ని నివారిస్తుంది.

3.చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
వర్షాకాలంలో కివి పండు తప్పకుండా తినండి.. ఎందుకో తెలుసా?వర్షాకాలంలో చర్మం సులభంగా దెబ్బతింటుంది. కివిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ E చర్మానికి తేమను అందిస్తుంది, పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.

4. హృదయ ఆరోగ్యానికి మేలు:
కివి వలన రక్తంలో ట్రైగ్లిసరైడ్లు తగ్గుతాయి. అలాగే రక్తప్రసరణ మెరుగవుతుంది. వర్షాకాలం హార్ట్ బీట్ మారకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

5.నిద్ర సమస్యలకు పరిష్కారం:
వర్షాకాలంలో వాతావరణ మార్పులు నిద్రపై ప్రభావం చుపిస్తాయి. కివి పండు తినడం వల్ల శరీరంలో సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి నిద్ర బాగా వస్తుంది. ఒక రిసెర్చ్ ప్రకారం రాత్రి నిద్రకు 1 గంట ముందు కివి తింటే నిద్ర నాణ్యత 35% పెరుగుతుంది.

6.శ్వాస సంబంధిత వ్యాధుల నివారణ:
వర్షాకాలంలో ఆస్తమా, అలర్జీలు ఎక్కువవుతాయి. కివిలోని విటమిన్ C, ఫ్లావనాయిడ్లు శ్వాసనాళాలపై రక్షణ వలయం సృష్టిస్తాయి. ఇది శ్వాసనాళాల్లో వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.

7.వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది:
కివిలో ఉండే యాక్టినిడిన్ అనే ఎంజైమ్ శరీరంలోని జలదోషానికి, కీళ్ల నొప్పులకు సహాయపడుతుంది. వర్షాకాలంలో ఈ ఫలితాలు మరింత ఉపయోగపడతాయి.

  • వర్షాకాలంలో కివి పండును ఎలా తినాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • ఉదయం పూట ఖాళీ కడుపుతో 1 కివి తింటే మంచిది.
  • నిద్రకి ముందు కివి తింటే నిద్ర బాగా పడుతుంది.
  • ఎక్కువ మొత్తంలో తినకండి. 1 లేదా 2 కివీలు తినండి
  • కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి.
  • ఆలెర్జీ ఉన్నవారు ముందుగా పరీక్షించుకోవడం మంచిది.