Eating Shrimp Benefits: రొయ్యలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు.. గుండె, మెదడు, థైరాయిడ్ సమస్యలు మాయం.. ఇంకా చాలా ఉన్నాయి.
Eating Shrimp Benefits: రొయ్యల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సుమారు100 గ్రాముల వండిన రొయ్యల్లో 22 నుంచి 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Health benefits of Eating Shrimp
రొయ్యలు.. వీటిని ఇష్టపడని వారంటూ ఉండదు. ఎంతో రుచికరంగా ఉండే సముద్ర ఆహార పదార్థం ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. రొయ్యలను అధిక పోషక విలువలతోనూ నిండిన ఆహార పదార్థంగా చెప్తారు. చర్మం, గుండె, మెదడు ఇలా చాలా రకాల సమస్యలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు రొయ్యలలో ఉన్నాయి. నిపుణులు కూడా రొయ్యలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలు అందుతాయని చెప్తున్నారు. మరి రొయ్యల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1.హై క్వాలిటీ ప్రోటీన్:
రొయ్యల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సుమారు100 గ్రాముల వండిన రొయ్యల్లో 22 నుంచి 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఇది కండరాల పెరుగుదల, దెబ్బతిన్న కణాల పునర్నిర్మాణం, ఇమ్యూనిటీ మెరుగుదలకు సహాయపడుతుంది. ప్రత్యేకంగా పిల్లలు, క్రీడాకారులు, వృద్ధులకు ఉపయుక్తమైన ప్రోటీన్ సప్లయర్.
2.గుండె ఆరోగ్యం:
రొయ్యల్లో ఔమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో EPA, DHA అనే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తాయి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక రొయ్యల్లో HDL గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. తాజా పరిశోధనల ప్రకారం రొయ్యలు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
3.మెదడు ఆరోగ్యం:
రొయ్యల్లో ఔమేగా-3లు, చోలి న్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి మెమరీ మెరుగుపరుస్తుంది. మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. డిప్రెషన్ తగ్గిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలను నివారిస్తుంది.
4.యాంటీఆక్సిడెంట్ శక్తి:
రొయ్యల్లో ఆస్టాక్సాన్థిన్ అనే బలమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీర కణాలను రక్షిస్తుంది. వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది. చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది
5. బరువు తగ్గాలనుకునేవారికి అనుకూలం:
రొయ్యలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు.. గుండె, మెదడు, థైరాయిడ్ సమస్యలు మాయం.. ఇంకా చాలా ఉన్నాయి.రొయ్యల్లో తక్కువ కేలరీలు ఉంటాయి. సుమారు 100g లో కేవలం 100 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్లు లేకపోవడం, ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల దీన్ని బరువు తగ్గించే డైట్స్ అని చెప్పొచ్చు. ఆకలిని నియంత్రించి ఎక్కువ తినకుండా చేస్తుంది.
6.చర్మం, కళ్ల ఆరోగ్యం:
రొయ్యల్లో ఆస్టాక్సాన్థిన్ తోపాటు విటమిన్ E, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను రక్షిస్తాయి. అంతేకాదు కంటిచూపు మెరుగుదల, వృద్ధాప్యలో వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తుంది.
7.ఇమ్యూనిటీ మెరుగుదల:
రొయ్యల్లో జింక్, ఐరన్, సెలీనియం, బీ-విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరం వైరస్‌లు, బ్యాక్టీరియా దాడుల నుంచి బలంగా తట్టుకునేలా చేస్తుంది.
8.థైరాయిడ్ ఆరోగ్యం:
రొయ్యల్లో ఐయోడిన్ కూడా చాలానే ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీన్ని తగిన పరిమితిలో తీసుకుంటే హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి ఉపయోగపడుతుంది.
రొయ్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మితంగా తీసుకోవాలి.
- కిడ్నీ సమస్య ఉన్నవారు ప్రోటీన్ పరిమితి పాటించాలి.
- కొంతమందికి రొయ్యలు తినడం వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది.