Ghee Disadvantages: మీకు ఈ సమస్య ఉందా.. అయినా నెయ్యి తింటుంన్నారా?.. విషంగా మారే ప్రమాదం ఉంది జాగ్రత్త
Ghee Disadvantages: నెయ్యిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్ (Saturated Fat) ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని పెంచుతుంది.

Health problems caused by eating too much ghee
భారతీయ వంటకాలలో నెయ్యి (Ghee)కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనిని రుచి, వాసన, పోషక విలువల కోసం ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కూడా నెయ్యి శరీరానికి శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తాయి. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం నెయ్యి తీసుకోవడంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇది అనారోగ్యాన్ని తీవ్రతరం చేయవచ్చు. మరి ఏ సమస్య ఉన్నవారు నెయ్యి తినకూడదు, తింటే ఏమవుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ సమస్య ఉన్నవారు నెయ్యి తినకూడదు:
1.అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు:
నెయ్యిలో సాచ్యురేటెడ్ ఫ్యాట్ (Saturated Fat) ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని పెంచుతుంది. దీనిని దీర్ఘకాలంగా తినడం వల్ల ఆర్టిరీలు రావడం, గుండె నొప్పి వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది.
2.గుండె జబ్బులు ఉన్నవారు:
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు నెయ్యిని మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. బీపీ, గుండె దడ, గుండె పని తీరును మళ్లీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
3.స్థూలకాయం, అధిక బరువు ఉన్నవారు:
ఒక 1 టీస్పూన్ నెయ్యిలో దాదాపు 45 నుంచి 50 క్యాలరీలు ఉంటాయి. అధికంగా తీసుకుంటే శరీరంలో అదనపు క్యాలరీలు నిల్వ అవుతాయి. ఇది బరువు పెరుగుదలకు దారితీస్తుంది, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశమూ ఉంది.
4.ఫ్యాటీ లివర్ సమస్యలు:
నెయ్యిలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలేయం (liver)పై భారం పెరుగుతుంది. గాలుబ్లాడర్ స్టోన్స్ ఉన్నవారికి నెయ్యి జీర్ణం కావడం కష్టం. ఇది మలబద్ధకం, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
5.మధుమేహం ఉన్నవారు:
మధుమేహం సమస్య ఉన్నవారు తప్పనిసరిగా నెయ్యిని పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కానీ అధికంగా తింటే శరీర బరువు పెరగడం ద్వారా షుగర్ కంట్రోల్ కష్టమవుతుంది. కొవ్వుతో కూడిన ఆహారం కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండే ప్రమాదం ఉంటుంది.
మితంగా నెయ్యి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
- రోజుకు 1 నుంచి 2 టీస్పూన్లు తీసుకుంటే
- జీర్ణక్రియకు సహాయపడుతుంది
- వాతం, శ్లేష్మ దోషాలను తగ్గిస్తుంది
- శరీర శక్తిని పెంచుతుంది
- మంచి ఫ్యాట్స్‌గా శరీరం ఉపయోగించుకునే అవకాశముంది
నెయ్యి అనేది ఒక ఆరోగ్యకరమైన ఆహార పదార్థం అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ తగిన మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో దీనిని పూర్తిగా నివారించడమో, అత్యల్ప మోతాదులోనే తినడం అవసరం.