రాత్రిళ్లు ఎక్కువగా ఆకలి అనిపిస్తుందా.. కొంపదీసి ఎక్కువగా తింటున్నారా?
రాత్రి సమయాల్లో చాలా మందికి ఆకలవుతుంటుంది. ఎప్పుడో ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడం..

Late Night Food
Late Night Food: రాత్రి సమయాల్లో చాలా మందికి ఆకలవుతుంటుంది. ఎప్పుడో ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడం.. రాత్రి భోజనం చేసిన తరువాత కూడా అర్థరాత్రి ఆకలితో మెలకువ రావడం, నిద్ర పట్టకపోవటం వంటి పరిస్థితి ఉంటుంది. కొందరికి రాత్రి వేళ ఏదో ఒక స్వీట్ తినందే నిద్ర పట్టదు. అయితే, రాత్రి పూట అతిగా ఆహారం తీసుకున్నా.. మధ్య రాత్రుళ్లో ఆకలేస్తుందని అతిగా తిన్నా పలు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. రాత్రివేళల్లో కొన్నిసార్లు భోజనం చేసిన గంటకే మళ్లీ ఆకలి అనిపించడం, కొందరికి స్వీట్ తినందే నిద్రపట్టకపోవటం వంటి ఇబ్బందులకు జీవనశైలిలో మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు.
అర్థరాత్రి ఆకలికి కారణం ఏమిటి..
♦ చాలా మంది ఉదయం అల్పాహారం తినరు. మధ్యాహ్న భోజనమూ అరకొరే. అంతేకాదు.. ఆహారం తీసుకోవటంలోనూ రోజూ సరైన సమయాన్ని పాటించరు. దీనికితోడు జంక్, పోషకాలు తక్కువ ఉండే ఆహారాన్ని తింటారు. అలాంటివారికి రాత్రుళ్లు ఎక్కువగా ఆకలి అనిపిస్తుంది.
♦ ఆకలికి కారణమైన హార్మోన్లలో లెఫ్టిన్ ఒకటి. నిద్రలేమితో బాధపడుతున్న వారిలో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో ఆకలి పెరుగుతుంది. మెలటోనిన్, కార్టిసాల్ స్థాయులు పెరగడం కూడా కొన్ని సందర్భాల్లో ఆకలిని ప్రభావితం చేస్తాయి. దీని వల్లే కార్బొహైడ్రేట్స్ తినాలనే కోరిక పెరుగుతుంది. అందుకే కొందరికి స్వీట్ తింటే కానీ నిద్ర పట్టదు.
♦ నిద్రపోయే ముందు స్ర్కోలింగ్ చేయడం కూడా రాత్రివేళ ఎక్కువ తినడానికి కారణం అవుతుందట.
♦ ఇలాంటి అలవాట్లను సరిచేసుకుంటే ఆకలిని నియంత్రించుకోగలం.