Rana Wife Food Store : రూ.5 లక్షల మష్రూమ్.. వెయ్యి రూపాయల కొబ్బరి బోండం.. రానా భార్య ఫుడ్ షాప్ లో కాస్ట్లీ ఫుడ్స్..
రానా భార్య మిహీక ఇటీవల ఫుడ్ స్టోరీస్ అనే ఫ్రాంచైజ్ బిజినెస్ ని మొదలుపెట్టింది.

Costly Foods in Rana Daggubati Wife Miheeka Food Stories Shop
Rana Wife Miheeka : రానా భార్య మిహీక ఇటీవల ఫుడ్ స్టోరీస్ అనే ఫ్రాంచైజ్ బిజినెస్ ని మొదలుపెట్టింది. ఈ షాప్ ఓపెనింగ్ కి రాజమౌళి, రమా రాజమౌళి, రానా, ఫరియా అబ్దుల్లా, సీరత్ కపూర్.. ఇలా పలువురు సెలబ్రిటీలు కూడా వచ్చారు. ఈ షాప్ లో ప్రపంచ దేశాల్లో దొరికే వెరైటీ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు దొరుకుతాయి. విదేశీ పండ్లూ, కూరగాయలు, చేపలు, మాంసాహారాలు, మష్రూమ్ రకాలూ, చాక్లెట్స్, స్వీట్లూ. మసాలాలూ, రకరకాల వాటర్ బాటిల్స్.. ఇలా చాలా ఉంటాయి ఇక్కడ.
ఇక్కడ ఎక్కువగా వేరే దేశాల్లో దొరికే ఫుడ్ దొరుకుతుంది. దీంతో కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా డబ్బున్నవాళ్ళు, సెలబ్రిటీలు ఈ స్టోర్ కి బాగా వెళ్తారు. అయితే ఈ స్టోర్ లో ఓ పుట్టగొడుగు ధర ఇప్పుడు చర్చగా మారింది. దాదాపు ఆరు కిలోల బరువుండే రెషీ మష్రూమ్ ఏకంగా అయిదు లక్షల రూపాయలు. దీంతో ఈ ధర చూసి షాక్ అవుతున్నారు. ఈ మష్రూమ్ చైనా, జపాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనే పండుతుంది. అక్కడ గ్రాముల్లో అమ్ముతూ ఉంటారు. కేవలం 20 గ్రాముల రెషీ మష్రూమ్ దాదాపు వెయ్యి రూపాయల పైనే ఉంటుంది. అంత కాస్ట్లీ మష్రూమ్ ఇప్పుడు హైదరాబాద్ లోని రానా భార్యకు చెందిన ఫుడ్ స్టోరీస్ లో దొరకడం గమనార్హం.
View this post on Instagram
Also See : NTR : ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోలు చూశారా..? బ్లాక్ సూట్ లో లుక్ అదిరిందిగా..
అలాగే ఇక్కడ థాయ్ లాండ్ కి చెందిన ప్రత్యేక కొబ్బరి బోండాలు దొరుకుతున్నాయి. ఆ బొండాం ధర ఒక్కోటి వెయ్యి రూపాయలు. ఆ నీళ్లు చాలా తియ్యగా ఉంటాయట. దీంతో పుట్ట గొడుగు కాస్ట్ అయిదు లక్షలు ఏంది, కొబ్బరిబోండం వెయ్యి రూపాయలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. ఇక్కడ కనీసం వెయ్యి రూపాయల నుంచి 20 వేల వరకు విలువైన ఫుడ్స్ ఉన్నాయి. ఫుడ్స్ తో పాటు రకరకాల కాఫీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మనకి కావాల్సిన కాఫీ ఫ్లేవర్ తయారు చేయించుకొని తాగొచ్చు. అక్కడే తినే ఫుడ్స్ కూడా చాలానే ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ స్టోరీస్ షాప్ కి మీరు వెళ్లి వివిధ దేశాలకు చెందిన ఫుడ్స్ తినాలి అనుకుంటే పర్స్ నిండా డబ్బులు తీసుకెళ్లాల్సిందే.
View this post on Instagram