New Covid Wave : మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్.. హంకాంగ్, సింగపూర్‌లో భారీగా కేసులు.. ఆగ్నేసియాలో కొత్త వేవ్..!
New Covid Wave : కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు.

New Covid Wave
New Covid Wave : కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. ఆగ్నేయాసియా అంతటా ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్‌లలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హాంకాంగ్‌లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయని ఆరోగ్య అధికారులు నివేదించారు.
Read Also : iPhone 16 Price : ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఆపిల్ లవర్స్ ఇలా చేస్తే అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!
హాంకాంగ్‌లో నగరంలో కొత్త కోవిడ్ వేవ్ విజృంభిస్తోంది. ఇన్ఫెక్షన్ రేటు మార్చి మధ్యలో 1.7 శాతం నుంచి ఇప్పుడు 11.4 శాతానికి పెరిగింది. ఆగస్టు 2024లో నమోదైన గరిష్ట స్థాయిని మించిపోయిందని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ డేటా తెలిపింది.
హాంకాంగ్‌లో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్‌లోని కమ్యూనికబుల్ డిసీజెస్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఔ మాట్లాడుతూ.. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల స్థాయి చాలా ఎక్కువగా పెరిగిందని అన్నారు. ఇటీవల కోవిడ్ పాజిటివ్ టెస్టుల సంఖ్య గత ఏడాదిలో అత్యధికంగా కనిపించింది.
డేటా ప్రకారం.. గత ఏడాదిలో కోవిడ్ మరణాల సంఖ్య కూడా అత్యధిక స్థాయికి చేరుకుంది. హాంకాంగ్ జనాభా 7 మిలియన్లకు పైగా ఉంది. మే 3 వరకు వారంలో మొత్తం 31 తీవ్రమైన కేసులు నమోదయ్యాయి.
ఈ వేవ్ గత రెండు ఏళ్లు మాదిరిగా పెద్దగా లేనప్పటికీ, మురుగునీటిలో వైరస్ పరిమాణం పెరగడం, ఆసుపత్రిలో చేరడం, కేసుల సంఖ్య పెరగడం, వైరస్ వేగంగా వ్యాపిస్తోందని సూచిస్తోంది.
సింగపూర్‌లో పెరిగిన కోవిడ్ కేసులు :
ఆసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక కేంద్రమైన సింగపూర్‌లో కోవిడ్ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఒక సంవత్సరంలో మొదటిసారిగా ఇన్ఫెక్షన్ గణాంకాలను విడుదల చేసింది. మే 3తో ముగిసిన వారంలో కోవిడ్ కేసులు 28శాతం పెరిగి 14,200కు చేరుకున్నాయి.
ఆసుపత్రిలో చేరిన బాధితుల సంఖ్య కూడా దాదాపు 30 శాతానికి పెరిగింది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరగవచ్చని, అయితే వైరస్ కొత్త వేరియంట్లు అంతగా తీవ్రమైనవి కావని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆసియాలో పెరుగుతున్న కోవిడ్ వేవ్ :
ఆసియాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్ రెండూ అతిపెద్ద నగరాల్లో కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా, ఆసియా అంతటా కరోనా కేసుల ప్రభావం పెరిగింది. ముఖ్యంగా రిస్క్ ఉన్నవారు పూర్తి వ్యాక్సిన్ తీసుకోవాలని, అవసరమైతే బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
అనేక శ్వాసకోశ వ్యాధులు సాధారణంగా చల్లని వాతావరణంలో ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. కానీ, కోవిడ్-19 వేసవిలో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తుందని సూచిస్తోంది.
ఇతర ఆసియా దేశాలలో కోవిడ్ పరిస్థితి :
చైనాలో కూడా కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం.. ఆస్పత్రుల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ ఐదు వారాల్లో రెట్టింపు అయింది. థాయిలాండ్ కూడా కోవిడ్-19 క్లస్టర్ వ్యాప్తిని ఎదుర్కొంది. ముఖ్యంగా ఏప్రిల్‌లో సాంగ్‌క్రాన్ పండుగ తర్వాత కోవిడ్ కేసులు పెరిగాయి.
Read Also : Vivo V27 Pro : వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. వివో V27 ప్రో ఎందుకు కొనాలంటే? యువత మెచ్చిన ఫోన్..!
ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు ఈసన్ చెన్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. తైవాన్‌లోని కావోసియుంగ్‌లో ఆయన కచేరీలను రద్దు చేసుకున్నారని కచేరీ చైనీస్ సోషల్ మీడియా అకౌంట్ వీబోలో నివేదించింది.