కరోనా వైరస్ మనుషులను ఎలా చంపేస్తుందంటే?

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 11:38 AM IST
కరోనా వైరస్ మనుషులను ఎలా చంపేస్తుందంటే?

Updated On : February 20, 2020 / 11:38 AM IST

కరోనా వేలమందిని బలితీసుకొంటోంది. వీళ్లలో డాక్టర్లు, వైద్యసిబ్బంది, పక్క బెడ్ పేషెంట్లూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఈ కొత్త వైరస్ మనుషులకు ఎలా సోకుతోంది? ఎందుకు కొంతమందినే బలితీసుకొంటోంది? వందమందికి కరోనా సోకితే సగటున ఇద్దరు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు. ఈ ఇద్దరు ఎలా చనిపోతున్నారు? వైరస్ ప్రభావమా? లేక వ్యాధులను తట్టుకొనే శక్తి  లేకపోవడమా? severe acute respiratory syndrome (SARS) ఇతర రోగలక్షణాల మధ్య పోలికలు, తేడాలను గమనించిన తర్వాత నిపుణుల అంచనా ఒక్కటే. కొత్తగా వచ్చిన వైరస్ కు ఆ వ్యక్తి వ్యాధినిరోధక శక్తికి మధ్య జరిగే పోరాటానికి సంకేతం.. జలుబు. ప్రతికేసులో కరోనా వైరస్ బాడీ సెల్స్ ను చంపేస్తోంది. ఇక వ్యాధంటారా? వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావం తక్కువగా ఉంటోంది. అదే వయస్సు ఎక్కువగా ఉన్నవారికి, అందులోనే వాళ్లకు మధుమేహం, హృదయ సంబంధిత రోగాలున్నప్పుడు కరోనా ప్రమాదకరంగా మారుతోంది. 

ఒక నివేదిక ప్రకారం 50ఏళ్లు దాటిన మగాళ్లను కరోనా ఎక్కువగా బలితీసుకొంటోంది. ఎప్పుడైనా వైరస్ వచ్చిన వెంటనే బాడీలోని వ్యాధినిరోధక వ్యవస్థ ఎదురుదాడిమొదలుపెడుతుంది. ఒకసారి నిరోధకశక్తి బలహీనపడిన తర్వాత వైరస్ చెలరేగిపోతుంది. దాన్ని తట్టుకోవడానికి చివరి ప్రయత్నంగా మిగిలిన నిరోధక వ్యవస్థ మరింత పోరాడుతుంది. దానివల్ల మరికొన్ని కణాల ధ్వంసం తప్పదని అంటున్నారు University of Maryland School of Medicine వైరాలజిస్ట్ మాథ్యూ ఫ్రైమాన్.

కరోనా బాధితుడు తుమ్మినా, దగ్గినా వైరస్ గాల్లోకి చేరుతుంది. ఒకవేళ బాధితుడు ఎదుటివాళ్ల ముఖంమీద తుమ్మితే మరింత ప్రమాదం. అతనికి సోకే అవకాశాలు ఎక్కువుంటాయి. లేదా ఆ వైరస్ వేరే చోట పడింతే.. తెలియక అక్కడ తాకినా, వాళ్ల నోరు, ముక్కు నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదే కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి ఎక్కవ వైరస్ సోకే అవకాశాలున్నాయి. రోగులను వెంటిలేటర్ల మీద ఉంచినప్పుడు వాళ్లు ఊపిరి పీల్చుకోవడానికి సాయం చేసేసమయంలోనూ వైరస్ తొందరగా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ రావడంతో బహుశా ముక్కులో పైభాగంలోకి వైరస్ చేరుతుంది. అదే సార్స్ ఐతే ఊపిరితిత్తుల్లో తిష్టవేస్తుంది. కరోనా వైరస్ కు బలమొస్తున్నకొద్దీ మృతకణాలు వరదలామారి, గాలివెళ్లే ద్వారం దగ్గరచేరడంతో ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది.

ఒకవేళ వ్యాధినిరోధకశక్తి ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించేలోపే వైరస్ కనుక రెండింతలు, మూడింతలైతే, ఇక వైరస్ ను నియంత్రించలేం. అందుకే కరోనాను ముందుగానే కనిపెట్టడం, చికిత్స చేయడం చాలా ముఖ్యం. దీన్నే వైద్యపరిభాషలో “cytokine storm” అంటారు. అంటే వైరస్ వచ్చిందనగానే వ్యాధినిరోధక వ్యవస్థ ఊపిరితిత్తుల్లోకి సెల్స్ ను పంపిస్తుంది. అక్కడే పోరాడుతుంది. కాకపోతే వైరస్ ఒక్క ఊపిరితిత్తుల్లోనే కాదు, ఒళ్లంతా వ్యాపించేస్తుంది. ఈ వైరస్ ను అడ్డుకోవడానికి వ్యాధినిరోధకవ్యవస్థ విధ్వంసాన్నే సృష్టిస్తుంది. మనిషి చాలా నీరసపడతాడు. ముధమేహం ఉన్నవాళ్లు అందుకే కరోను ఎదుర్కోలేరు. బలంగా ఉన్నవాళ్లకు వ్యాధినిరోధక శక్తి ఎక్కువ. ఇది సహజం.

అదే ఊపిరితిత్తుల రోగాలున్నవాళ్లు, వయస్సు మళ్లినవాళ్లు, గుండె సంబంధిత రోగాలున్నవాళ్లను తేలిగ్గానే వైరస్ జయిస్తుంది. అలాగని వీళ్లను మాత్రమే కరోనా వైరస్ బలితీసుకొంటుందని వైద్యనిపుణులు తేల్చిచెప్పడం లేదు. ఒక్కొక్కరి కేసు ఒక్కోలా ఉంది. ఒకవేళ రోగులు కనుక రికవర్ అయితే, వాళ్లలో వ్యాధినిరోధక వ్వవస్థ పనిచేసినట్లు లెక్క. వాళ్లలో కరోనా వైరస్ ఉండదు.

Read More>>ఉపహార్ థియేటర్ కేసు….అన్సాల్స్ బద్రర్స్ కు బిగ్ రిలీఫ్