Parenting Problems: ఎక్కువసేపు మూత్రం ఆపుకుంటున్నారా.. అయితే మీకు పిల్లలు పుట్టరు.. నిపుణులు ఎం చెప్తున్నారో తెలుసుకోండి
ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడం వల్ల సంతాన సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు నిపుణులు.

Parenting Problems and solutions
సాధారణంగా మనం రోజు చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. ఆరోగ్యం విషయంలో వీటి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. నిర్లక్ష్యం ఎప్పటికైనా భారీ మూల్యాన్నే కోరుతుంది. ప్రెజెంట్ జనరేషన్ లో చాలా మంది తెలిసి చేస్తున్న చిన్న తప్పు వల్ల పెద్ద సమస్యనే ఎదుర్కొంటున్నారు. జీవితాంతం భాదను అనుభవిస్తున్నారు. ఆ సమస్య మరేదో కాదు పిల్లలు లేకపోవడం. అవును ఈ మధ్య కాలంలో యువత చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇలా చాలా కారణాల వల్ల ఈ సమస్యతో భాదపడుతున్నారు. పిల్లలు లేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
అయితే తాజా అధ్యాయనాల ప్రకారం మనం రెగ్యులర్ గా చేసే చిన్న తప్పు ఈ పెద్ద సమస్యకు కారణం అవుతుందట. ఆ చిన్న తప్పు మరేదో కాదు మూత్రం ఎక్కువసేపు ఆపుకోవడం. వినడానికి ఇది చాలా చిన్న సమస్యగా అనిపిస్తుంది. కానీ, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా చెప్తున్నారు. చాలా మంది బద్ధకం కారణంగా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటారు. అయితే అది ఒకటి రెండు సార్లు అయితే పరవాలేదు కానీ, అలవాటుగా మారితేనే ప్రమాదం అంటున్నారు. ఇది క్రమంగా కిడ్నీ సమస్యకు, గుండె సమస్యలకు కారణం అవుతుందట.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడం వల్ల సంతాన సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువ సేపు యూరిన్ ని ఆపుకోవడం వల్ల పెల్విస్ మజిల్స్ పై ప్రభావం పడుతుందట. అది దెబ్బతినడం వల్ల గర్భధారణ సాధ్యంకాదట. ఆవిధంగా సంతాన సమస్యలు వచ్చే ముప్పు ఉందని చెప్తున్నారు. కాబట్టి.. సంతానం కోసం చూస్తున్న వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అందుకే ఆడవాళ్ళైనా, మగవాలైనా మూత్రం ఆపుకోవడం అనే అలవాటు నుండి బయటపడాలని సూచిస్తున్నారు.