జలుబు మంచిదే: కరోనావైరస్ నుంచి కోల్డ్ మనల్ని ఎలా రక్షిస్తుందంటే

  • Published By: murthy ,Published On : October 5, 2020 / 06:53 PM IST
జలుబు మంచిదే: కరోనావైరస్ నుంచి కోల్డ్ మనల్ని ఎలా రక్షిస్తుందంటే

Updated On : October 5, 2020 / 7:28 PM IST

coronavirus: కరోనా గురించి ఇది నిజంగా మంచి వార్తే. మనకొచ్చే జలుబు కరోనా నుంచి మనల్ని రక్షిస్తుందని తేల్చిచెబుతున్నారు సైంటిస్ట్‌లు. జలుబు తరచు రావడానికి కారణం rhinovirus. దానివల్లే బాడీలో యాంటీవైరల్ వ్యవస్థ యాక్టీవ్ అవుతుంది. అంటే బాడీకి రక్షణకవచం తయారైనట్లే. ఇది ఫ్లూనికూడా ఎదిరిస్తుంది.

Yale University పరిశోధకులు ప్రపంచాన్నికి కొత్త విషయాన్ని పంచుకున్నారు. జలుబుకు కారణమైయ్యే rhinovirus, యాంటీవైరల్ ఏంజెట్ interferon ఉత్పత్తికావడానికి కారణమవుతుంది.

బైట నుంచి బాడీలోకి వచ్చే వైరస్‌లను ఎదిరించడానికి వ్యాధినిరోధక వ్యవస్థ తొలి స్పందన ఇది.


ఇలాగే Covid-19 virus కూడా వస్తే వ్యాధినిరోధక వ్యవస్థ ఇలాగే స్పందిస్తుందా? వైరస్‌ను తరమికొట్టడానికి ప్రయత్నిస్తుందా? ఇదే సందేహం సైంటిస్ట్‌లకూ వచ్చింది.

common cold virusను అడ్డుకోవడానికి సెల్స్ చుట్టూ యాంటీవైరల్ రక్షణ ఎర్పాటుచేస్తుంది. అంటే ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు లైనింగ్ వేస్తుంది. ఇదే రక్షణ కవచం. ఎక్కడైతే వైరస్ లు ఎదుగుతాయో అక్కడే ఈ సెల్స్ లైనింగ్ ను ఎర్పాటుచేస్తాయి. flu, common cold, Covid-19 ఏదైనా ఎలాంటి వైరస్ అయినా మనం పీల్చినప్పుడు వాటికి స్పందనగా ఊపిరితిత్తుల మార్గంలో లైనింగ్‌ ఎర్పాటవుతుంది.

Covid-19కు వ్యతిరేకంగా interferon పనిచేస్తుంది. దీన్ని తెలుసుకోవడానికి ఈ ఇంటర్‌ఫెరాన్‌ను
సెల్స్ మీద కోటింగ్‌లా వాడారు. అప్పుడు Covid-19కు కారణమైయ్యే వైరస్‌ను ఈ లైనింగ్ అడ్డుకుంది.



ఇలా interferon వల్ల వచ్చే ఇమ్యూనిటీ రెండువారాలు ఉంటుంది. అంటే దీనివల్ల కరోనానూ దీర్ఘకాలం అడ్డుకోలేదు. బాడీలో వ్యాధినిరోధక వ్యవస్థ ఉత్తేజంతో ఉన్నప్పుడు తాత్కాలికంగా కరోనాతో సహా ఎలాంటి వైరస్ ని అయినా అడ్డుకోవగలరు. ప్రస్తుతానికి ఫ్లూ వరకు ఈ టెక్నిక్ బాగానే పనిచేస్తోంది. రోజుకో రకంగా మారే కరోనా సంగతేంటి? నమ్మకంగా అడ్డుకోగలమని చెప్పలేకపోతున్నారు వైద్యనిపుణులు.