Oxygen Levels : వాయు కాలుష్యం వల్ల ఆక్సిజన్ స్ధాయిలు పడిపోతున్నాయా? ఆక్సిజన్ స్ధాయిలను పెంచే ఆహారాలను రోజు తీసుకోండి

వెల్లుల్లిలో ఉండే అద్భుతమైన గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. వీటిలో ఆల్కలీన్ అధిక మోతాదులో ఉంటుంది. అలాగే పీహెచ్ స్థాయి కూడా 8 కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఓ వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.

Oxygen Levels : వాయు కాలుష్యం వల్ల ఆక్సిజన్ స్ధాయిలు పడిపోతున్నాయా? ఆక్సిజన్ స్ధాయిలను పెంచే ఆహారాలను రోజు తీసుకోండి

Depleting Oxygen Levels

Updated On : August 28, 2022 / 11:33 AM IST

Oxygen Levels : సాధారణంగా వాయు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడిన వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మాస్కులు ధరించడం ద్వారా కొంత వరకు మనం కాలుష్యం బారిన పడకుండా మాస్కులు ధరించటం ద్వారా సమస్యబారిన పడకుండా ఉండవచ్చు. అలాగే యోగా, వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉన్న పళ్లు, తాజా కూరగాయల ద్వారా ఆక్సిజన్ స్థాయిలు పెంచేలా చేయటంలో సహాయపడతాయి. ఆహారంలో 80 శాతం ఆల్కలీన్ ఉన్న
పదార్థాలను తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని అంటున్నారు. వీటిని రోజు తీసుకునే ఆహారంలో భాగం చేయడం వల్ల మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు
అంటున్నారు. రక్తంలో ఆక్సిజన్ స్ధాయిలను పెంచే ఆహారాలేంటో చూద్దాం..

కీర దోస ; కీరా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ మాత్రం ఆమ్ల గుణాన్ని కలిగి ఉండదు. శరీరానికి చలవ చేయడంతో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి
కూడా ఇది మంచి ఆహారం. కీరా కూడా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచుతుంది.

ద్రాక్ష ; ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి ఆక్సిజన్ స్థాయిని పెరిగేలా చేస్తాయి.

వెల్లుల్లి ; వెల్లుల్లిలో ఉండే అద్భుతమైన గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. వీటిలో ఆల్కలీన్ అధిక మోతాదులో ఉంటుంది. అలాగే పీహెచ్ స్థాయి కూడా 8 కంటే
ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఓ వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.

నిమ్మపండు ; నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంతో పాటు శక్తిని ఇస్తుంది. వీటితో పాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.

బొప్పాయి ; బొప్పాయి వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల రక్త కణాలలో ఆక్సిజన్‌ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దీనిని తీసుకోవచ్చు. దీనిలో పీహెచ్
విలువ 8.5 కంటే ఎక్కువ ఉంటుంది.

క్యాబేజీ, బ్రకోలీ ; బ్రకోలీలో చాలా రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. క్యాబేజీలోనూ ఇవే గుణాలు ఉంటాయి. క్యాబేజీలో
అధిక మొత్తంలో ఆల్కలీన్ ఉండటంతో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతుంది.

అరటి ; అరటిపళ్లలో ఆల్కలీన్ మోతాదు కూడా అధికంగా ఉంటుంది. అరటి పండ్లు పచ్చి, పండినవి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడతాయి.