Artificial Blood: క్లినికల్ ట్రయల్స్ లో కృత్రిమ రక్తం.. జపాన్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి
ఈ కృత్రిమ రక్తం విషయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మాములు మనిషి రక్తంలా కాకుండా దాదాపు రెండు సంవత్సరాల పాటు కృత్రిమ రక్తం నిల్వ ఉంటుందట.

Artificial blood clinical trails
ప్రమాదాల్లో సరైన సమయానికి రక్తం దొరకక చాలా మంది చనిపోతున్నారు. వందల, వేల బ్లడ్ బ్యాంక్స్ ఉన్నప్పటికీ రక్తం దొరకక చనిపోతున్నవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కానీ, ఇక ముందు అలాంటి మరణాలు ఉండకపోవచ్చు అని అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. కారణం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా ఆ దేశ శాస్త్రవేత్తల కృత్త్రిమ రక్తం తయారీపై ప్రయోగాలు చేస్తున్నారు. ఎన్నో పరిశోదనలు, పరీక్షల అనంతరం కృత్రిమ రక్తం తయారీ అనేది తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారట. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలంగా మారింది. ఇది గనక సక్సెస్ అయితే వైద్యచరిత్రలోనే ఇదొక అద్భుతం అనే చెప్పాలి. రక్తం కొరతతో చనిపోతున్న ఎంతోమందిని కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది.
ఈ కృత్రిమ రక్తం విషయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మాములు మనిషి రక్తంలా కాకుండా దాదాపు రెండు సంవత్సరాల పాటు కృత్రిమ రక్తం నిల్వ ఉంటుందట. సహజ రక్తం కేవలం 42 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. మరో విశేషం ఏంటంటవ్.. సహజ రక్తంలాగ దీనికి రక్త వర్గాలు ఉండవు. ఈ కృత్రిమ రక్తం ఏ గ్రూప్ వారికైనా వినియోగించవచ్చు. నిజంగా ఇది అద్భుతమని చెప్పాలి.
ఇక కృత్రిమ రక్తం క్లినికల్ ట్రయల్స్ మార్చిలో మొదలయ్యాయి. మధ్య వయసు గల 16 మందికి 100 నుంచి 400 మిల్లీలీటర్ల కృత్రిమ ఎక్కించారు. ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే 2030 నాటికి కృత్రిమ రక్తం అందుబాటులోకి తీసుకువస్తాం అంటూ జపాన్ చెప్తుంది. అలా ఈ అద్భుతాన్ని క్రియేట్ చేసిన మొట్టమొదటి దేశంగా జపాన్ ఆవిర్భవిస్తుంది. ఇక అగ్రరాజ్యం అమెరికా కూడా కృత్రిమ రక్తం తయారీపై ప్రయోగాలు చేస్తుంది. ఇప్పటికే ప్రీ క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది. కానీ, ఈ విషయంలో జపాన్ ముందు ఉంది.