Liver Health : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే రసాయనాలతో పండించిన ఆహారం వద్దు!
కాలేయ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం తాజాగా ఉండేలా చేసుకోవాలి. దీని వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రసాయనాలతో పండించిన ఆహారాన్ని తీసుకోకపోవటమే మంచిది. దీని వల్ల లివర్ కు ముప్పు కలుగుతుంది.
Liver Health : ఇటీవలి కాలంలో కాలేయ వ్యాధుల సమస్య అధికమౌతుంది. చాలా మంది కాలేయ సమస్యలను తేలికగా తీసుకోవటమే ఇందుకు కారణం. కాలేయ వ్యాధుల్లో లివర్ సిర్రోసిస్ అనేది ప్రస్తుతం అత్యంత ప్రమాదంగా పరిణమించింది. శరీరంలోని ప్రధాన అవయవాల్లో ఒకటైన కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కాలేయానికి ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. జీవనశైలి, ఆహారంలో వచ్చిన విభిన్న మార్పులతో ప్రస్తుతం కాలేయ వ్యాధుల తీవ్రత అధికమైంది.
కాలేయ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం తాజాగా ఉండేలా చేసుకోవాలి. దీని వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రసాయనాలతో పండించిన ఆహారాన్ని తీసుకోకపోవటమే మంచిది. దీని వల్ల లివర్ కు ముప్పు కలుగుతుంది. సేంద్రీయ పద్దతుల్లో పండించిన ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గుచూపాలి. ఇలాంటి ఆహారం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అశుభ్రత కలిగిన బయటి ఆహారం కంటే ఇంట్లో తయారైన వంటకాలను మాత్రమే తీసుకోవటం మంచిది. ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవటం ఉత్తమం.
నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి చేసిన నీటిని చల్లారిన తరువాత తాగటం మంచిది. వేపుళ్లు, ప్రిజర్వేటివ్స్ వంటి పదార్ధాలను నివారించాలి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వైద్యుల సూచనలు సలహాలు పాటించకుండా సొంత వైద్యం సరైంది కాదు. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల దుష్పలితాలను చవిచూడాల్సి వస్తుంది. రోజువారి వ్యాయామాల ద్వారా లివర్ ను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ధూమపానం, మద్యపానం వంటి వాటిని దూరంగా ఉండాలి. లివర్ సమస్యలు రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు తీసుకోవటం మంచిది.