Lupine Diagnostics: విజయవాడలో శాటిలైట్ ల్యాబొరేటరీని ప్రారంభించిన లుపిన్ డయాగ్నోస్టిక్స్

విజయవాడలోని లుపిన్ యొక్క కొత్త ల్యాబొరేటరీ అత్యాధునిక రోగనిర్ధారణ సాంకేతికతను కలిగి ఉంది. అత్యున్నత అర్హతలు కలిగిన వైద్య నిపుణుల బృందంతో కూడిన సిబ్బందిని కలిగి ఉంది. ఈ అధునాతన మౌలిక సదుపాయాలు స్థానిక కమ్యూనిటీకి నమ్మకమైన, అధిక-నాణ్యత డయాగ్నస్టిక్ సేవలను అందించడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్‌కు తగిన శక్తిని ఇస్తాయి

Lupine Diagnostics: విజయవాడలో శాటిలైట్ ల్యాబొరేటరీని ప్రారంభించిన లుపిన్ డయాగ్నోస్టిక్స్

Updated On : May 27, 2023 / 9:23 PM IST

Vijayawada: అంతర్జాతీయంగా ఫార్మా అగ్రగామి లుపిన్ లిమిటెడ్ (లుపిన్) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ శాటిలైట్ ల్యాబొరేటరీని గురువారం ప్రారంభించినట్లు వెల్లడించింది. అధిక-నాణ్యత కలిగిన పరీక్షా సేవల అవకాశాలను మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్స్ నెట్‌వర్క్‌ను పెంచడం లక్ష్యంగా లుపిన్ డయాగ్నోస్టిక్స్ చేస్తున్న విస్తరణలో ఇది ఒక భాగం. కొత్తగా ప్రారంభించబడిన ల్యాబొరేటరీ భారతదేశం అంతటా లుపిన్ కు ఉన్న 27 లేబరేటరీ, 410కి పైగా సేకరణ కేంద్రాలతో కూడిన లుపిన్ డయాగ్నోస్టిక్స్ విస్తృత నెట్‌వర్క్‌ను సంపూర్ణం చేస్తుంది. ఈ విస్తరణ సమగ్ర రోగనిర్ధారణ పరిష్కారాలను అందించడానికి, రోగనిర్ధారణ పరిశ్రమలో దాని స్థానాన్ని బలోపేతం చేయడానికి లుపిన్ యొక్క నిబద్ధతను తెలుపుతుంది.

Amazon Huge Discounts : అమెజాన్‌లో 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్ డీల్స్ మిస్ చేసుకోవద్దు..!

విజయవాడలోని లుపిన్ యొక్క కొత్త ల్యాబొరేటరీ అత్యాధునిక రోగనిర్ధారణ సాంకేతికతను కలిగి ఉంది. అత్యున్నత అర్హతలు కలిగిన వైద్య నిపుణుల బృందంతో కూడిన సిబ్బందిని కలిగి ఉంది. ఈ అధునాతన మౌలిక సదుపాయాలు స్థానిక కమ్యూనిటీకి నమ్మకమైన, అధిక-నాణ్యత డయాగ్నస్టిక్ సేవలను అందించడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్‌కు తగిన శక్తిని ఇస్తాయి. అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యంల సమ్మేళనం, ఖచ్చితమైన, సమర్థవంతమైన పరీక్షను నిర్ధారిస్తుంది. సకాలంలో రోగ నిర్ధారణ, మెరుగైన రోగి సంరక్షణకు సైతం అనుమతిస్తుంది. సాధారణ, ప్రత్యేక పరీక్షలతో పాటు విజయవాడలో కొత్తగా ప్రారంభించబడిన ల్యాబొరేటరీ విస్తృతమైన రోగనిర్ధారణ సేవలను అందిస్తుంది. వీటిలో క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, హెమటాలజీ, బయోకెమిస్ట్రీ, సెరాలజీ, ఇమ్యునాలజీ ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.