Milap: క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించిన వారికి మద్దతుగా హైదరాబాద్‌లో ‘హెయిర్ డొనేషన్ డ్రైవ్’ నిర్వహించిన మిలాప్
ప్రజలు ఒకరికొకరు, వారు చేయగలిగిన రూపంలో సహాయం చేయటానికి ముందుకు రావటం చాలా సంతోషాన్నిస్తుంది. క్యాన్సర్ అనేది ఒక దీర్ఘకాలిక పరిస్థితి, దీనికి ప్రియమైనవారి నుంచి నిరంతర మద్దతు, ప్రేరణ అవసరం, వీటన్నిటికీ మించి కఠినమైన వైద్య చికిత్స కూడా అవసరం పడుతుంది.

Cancer: బెంగళూరులో విజయవంతమైన హెయిర్ డొనేషన్ క్యాంప్ తర్వాత.. హైదరాబాద్‌లో తమ హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లో రెండవ రౌండ్‌ను నిర్వహించింది మిలాప్. క్యాన్సర్ మీద పోరాడి విజయం సాధించిన వారి అవసరాలపై అవగాహన కల్పించి, వారి శ్రేయస్సుకు అర్థవంతంగా దోహదపడేలా ‘హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్’, ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్’ సహకారంతో నగరంలోని వాలంటీర్లకు ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ఒక భాగస్వామి యొక్క విగ్ తయారీ కేంద్రంలో నిర్వహించారు. ఇక్కడ సేకరించిన జుట్టును విగ్‌లుగా తయారు చేసి అవసరమైన రోగులకు పంపిణీ చేస్తారు.
Tips to keep bananas fresh : అరటిపండు త్వరగా రంగు మారకుండా ఉండాలంటే ఇలా చేయండి
మిలాప్ ప్రెసిడెంట్, కో-ఫౌండర్ అనోజ్ విశ్వనాథన్ మాట్లాడుతూ “ప్రజలు ఒకరికొకరు, వారు చేయగలిగిన రూపంలో సహాయం చేయటానికి ముందుకు రావటం చాలా సంతోషాన్నిస్తుంది. క్యాన్సర్ అనేది ఒక దీర్ఘకాలిక పరిస్థితి, దీనికి ప్రియమైనవారి నుంచి నిరంతర మద్దతు, ప్రేరణ అవసరం, వీటన్నిటికీ మించి కఠినమైన వైద్య చికిత్స కూడా అవసరం పడుతుంది. నగరంలోని మా భాగస్వాములు, వాలంటీర్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.