హైదరాబాద్ నిమ్స్ లోనే : కడుపులో కత్తెర వదిలేసిన డాక్టర్

  • Published By: chvmurthy ,Published On : February 9, 2019 / 06:04 AM IST
హైదరాబాద్ నిమ్స్ లోనే : కడుపులో కత్తెర వదిలేసిన డాక్టర్

Updated On : February 9, 2019 / 6:04 AM IST

హైదరాబాద్ లో పేరున్న ఆస్పత్రికి. పేదల నుంచి పెద్ద మంత్రుల వరకు ఏ ట్రీట్ మెంట్ కోసం అయినా మొదట వచ్చేది నిమ్స్. ఓ పేషెంట్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం ఇప్పుడు సంచలనం అయ్యింది. మూడు నెలల క్రితం ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు.. కడుపులోనే కత్తెర వదిలేసి కుట్లు వేశారు. ఆరోగ్యం మరింతగా ఇబ్బంది పెట్టటంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చింది.  ఎక్స్ రే తీశారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. కడుపులో కత్తెర ఉన్నట్లు.

హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి 3 నెలల క్రితం ఓ మహిళ ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా కడుపులోనే కత్తెర ఉంచి కుట్లు వేసేశారు. డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన ఆమెకు, కొద్ది రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి రావటం మొదలైంది. దీంతో ఆమె బంధువులు ఆమెకు ఎక్స్రే తీయించారు. ఎక్స్ రే లో  కడుపులో కత్తెర ఉండటంగమనించిన బాధితురాలి బంధువులు నిమ్స్ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. 

వైద్యలు తక్షణమే ఆమెకు ఆపరేషన్  చేసి కత్తెర తొలగించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  బాధిత కుటుంబీకులు పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి చేరుకుని ఘటనకు బాధ్యులైన డాక్టర్ల గురించి దర్యాప్తు ప్రారంభించారు.