కరోనాకు కొత్త కొమ్ములు.. కంట్రోల్ తప్పిందా? 70శాతం వేగంగా వ్యాపించగలదు!

New coronavirus strain not ‘out of control : యూకేలో విజృంభిస్తోన్న కొత్త కరోనావైరస్ జాతి ఇంకా ‘నియంత్రణ దాటి వెళ్లలేదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మార్పు చెందిన కరోనావైరస్ జాతి వైరస్ నియంత్రణ దాటిందంటే యూకేలో భయాందోళన ఆందోళనకు దారితీస్తుందని UK ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కొత్త రకం వైరస్ మరింత తీవ్రమైందని, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవని WHO అధికారి మైకేల్ ర్యాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చర్యలు సరైనవిగా ర్యాన్ పేర్కొన్నారు. వైరస్ అదుపులో ఉందని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ సమర్థవంతంగా కట్టడి చేయొచ్చునని చెప్పారు.
కొత్త కరోనావైరస్ వేరియంట్ ప్రస్తుతం ఉన్న జాతి కంటే 70 శాతం ఎక్కువ వ్యాప్తి చేయగలదని ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రిటన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. లండన్‌లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతున్నారు. ఇప్పటివరకు 1,000 మంది కొత్త రకం వైరస్ బారిన పడ్డారు. వారిలో నలుగురు మాత్రమే మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఒక వైరస్ రెండుగా విడిపోయే క్రమంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వైరస్ మనుగడ లేదంటే అవి వెంటనే చనిపోతాయి. SARS-CoV-2వైరస్ ప్రపంచమంతా విస్తరించి అనేక మార్పులతో మరింత విజృంభించింది. సాధారణంగా జనాభాలో అత్యధికుల్లో పాత వైరస్ లేదా ఇతర వ్యాధులకు వేసిన టీకాల వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో యాంటీబాడీల ఉత్పత్తి జరిగి ఉండాల్సింది. ఇందుకు చాలా సమయం పట్టొచ్చు. ఈ వైరస్ ఉన్న రోగులను పరిశీలించగా, మొత్తం 23 జన్యుమార్పులు ఉన్నట్లు బయటపడింది. కొమ్ములోనే అధిక జన్యుమార్పుల వల్ల వైరస్ కణాల్లో కాపీలు ఏర్పడే వేగం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్‌కు చెందిన నిపుణులు వెండీ బార్క్‌లే చెబుతున్నారు.
కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి తెలియాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు. అప్పటివరకూ కొత్త రకం వైరస్ గురించి ఎలాంటి పుకార్లు, వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. కొత్త రకం వైరస్ కారణంగా వచ్చే వ్యాధి లక్షణాల్లో పెద్దగా తేడాలేమీ లేవని అంటున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన నిబంధనలనే పాటించడం ద్వారా కొత్త రకం వైరస్‌ను నియంత్రించవచ్చునని సూచిస్తున్నారు.