Blood Test: సూది లేకుండానే రక్త పరీక్షలు.. 20 సెకన్లలో రిపోర్ట్స్.. నిలోఫర్ హాస్పిటల్ అద్భుత సృష్టి
భారతదేశంలోనే మొట్టమొదటి సరిగా సూది లేకుండానే రక్త పరీక్ష చేసే ఏఐ బేస్డ్ డయాగ్నొస్టిగ్ టూల్ ను నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చింది.

Bood test reports
వైద్య శాస్త్రం రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతోంది. అత్యాధునిక పరికరాలు, వైద్య సేవలు అందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే రోబోటిక్, CT, MRI లాంటి అత్యాధునిక పరికరాలను వైద్య సేవల్లో వాడుతున్నారు. ఇప్పుడు మరో కొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్ సంస్థలు. భారతదేశంలోనే మొట్టమొదటి సరిగా సూది లేకుండానే రక్త పరీక్ష చేసే ఏఐ బేస్డ్ డయాగ్నొస్టిగ్ టూల్ ను నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు రిపోర్ట్స్ ని కూడా నిమిషం లోపే ఇస్తుందట ఈ టూల్. నిలోఫర్ హాస్పిటల్, సుశేనా హెల్త్ ఫౌండేషన్ క్విక్ వైటల్స్ దీన్ని దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్ లో ఫేస్ స్కానింగ్ చేసి కేవలం 30 సెకన్లలోనే టెస్టులు పూర్తి చేస్తుంది ఈ పరికరం. మునుపటిలా శాంపిల్ ఓకాసం సూదులతో రక్తాన్ని ఇవ్వడం, రిపోర్ట్స్ కోసం గంటల గంటలు వెయిట్ చేయడం ఇకపై ఉంటాడు. దీనివల్ల పేషేంట్స్ కి ట్రీట్మెంట్ త్వరగా అండ్ అవకాశం ఉంది. అయితే ముందుగా ఈ పరీక్ష విధానాన్ని నిలోఫర్ లోకి అందుబాటులోకి తేనున్నారు. ఆ తరువాత మహారాష్ట్ర లో ప్రవేశపెడుతామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇంకా పరికరం వల్ల రక్తపోటు, హార్ట్ రేట్, హీమోగ్లోబిన్ ఏ1సి వంటివి కూడా తెలుసుకోవచ్చట. త్వరలోనే ఈ సేవలను అన్ని ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురానున్నామని నిర్వాహకులు తెలిపారు.