మా Sputnik V వ్యాక్సిన్ 92శాతం అద్భుతంగా పనిచేస్తుంది : రష్యా

  • Published By: sreehari ,Published On : November 11, 2020 / 08:08 PM IST
మా Sputnik V వ్యాక్సిన్ 92శాతం అద్భుతంగా పనిచేస్తుంది : రష్యా

Updated On : November 11, 2020 / 8:35 PM IST

Russia coronavirus vaccine : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వందలాది వ్యాక్సిన్లు రేసులో ఉన్నాయి. ఇప్పటికే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన దేశంగా రష్యా చెప్పుకొంటోంది.

ఇప్పటికే పలు ట్రయల్స్ పూర్తి చేసిన రష్యా తమ ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ పంపిణీ కూడా మొదలుపెట్టేసింది.



ఈ Sputnik V కరోనా వ్యాక్సిన్ 92 శాతం సమర్థవంతంగా పనిచేయగలదని రష్యా నొక్కి వక్కాణిస్తోంది. మధ్యంతర ట్రయల్ ఫలితాల్లో కరోనాను నిరోధించగల సామర్థ్యం తమ వ్యాక్సిన్ కు ఉందని రష్యా వెల్లడించింది.

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్ భాగస్వామి BioNTech సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా 90 శాతానికి కంటే సమర్థవంతంగా పనిచేయగలదని ప్రకటించింది.

ఫైజర్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత రష్యా సావరెన్ వెల్త్ ఫండ్ RDIF కూడా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సమర్థతపై ప్రకటన జారీ చేసింది.



ఇటీవలే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరగ్గా.. అందులో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసిందని రష్యా పేర్కొంది. కరోనా సోకిన 20 బాధితులకు ప్లేసిబో తీసుకున్న వారికి స్పుత్నిక్ వ్యాక్సినేషన్ తీసుకున్నవారికి సంబంధించి డేటాను RDIF వెల్లడించింది.

ప్రస్తుతం 40వేల మంది వాలంటీర్లు.. ప్లేసిబో నియంత్రిత మూడో దశ స్పుత్నిక్ వి క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్ 20వేల మంది తీసుకోగా.. మొదటి, రెండో మోతాదులను కలిపి 16వేల మందికిపైగా పాల్గొన్నారు. గత ఆగస్టులో రష్యా కరోనా వ్యాక్సిన్ ఆమోదం పొందిన మొట్టమొదటి దేశంగా అవతరించింది.



మూడో దశ మొదలు కాకుండానే వేగవంతంగా ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు చేయడంపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. రష్యా కరోనా వ్యాక్సిన్ సమర్థత, సురక్షితానికి సంబంధించి డేటా కూడా అందుబాటులో లేదు.



సెప్టెంబర్ నెలలో మొదటి కరోనా వ్యాక్సిన్ ఫలితాలకు సంబంధించి డేటాను రష్యా ప్రచురించింది.

మూడు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి డేటా వచ్చేంత వరకు పాల్గొన్న అభ్యర్థులపై ఆరు నెలల పాటు పర్యవేక్షణ ఉంటుందని RDIF తెలిపింది.