సైంటిస్టులు కనిపెట్టేశారు:Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!

  • Published By: sreehari ,Published On : January 28, 2020 / 04:37 AM IST
సైంటిస్టులు కనిపెట్టేశారు:Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!

Updated On : January 28, 2020 / 4:37 AM IST

డ్రాగన్ దేశమైన చైనాలో డెడ్లీ #coronavirus.. ఎలా పుట్టింది? అసలు దీని మూలం ఎక్కడ? నిజంగా ఇది అంటువ్యాధేనా? ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? జంతువుల్లోని ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా సంక్రమించింది? పాముల నుంచే ఈ వైరస్ సోకింది అనడానికి బలమైనా ఆధారాలు ఉన్నాయా? లేదా మరి ఏదైనా కారణమా? ప్రాణాంతక వైరస్ ను కంట్రోల్ చేయలేమా? దీనికి నివారణ లేదా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రతిఒక్కరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

80 మందికి పైగా మృతి : 2700కి పైగా కేసులు :
చైనాలోని వుహాన్ సిటీలో మొదలైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకుతూ ప్రాణాలు బలితీసుకొంటోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 80కిపైగా మృతిచెందగా, మరో 2700కు పైగా #coronavirusకేసులు నమోదయ్యాయి. గాలిద్వారా వేగంగా వ్యాప్తిచెందే ఈ వైరస్‌ను ఎలా అంతం చేయాలి అనేదానిపై విస్తృత స్థాయిలో పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతానికి ఈ వైరస్ నివారణకు ఎలాంటి వ్యాక్సీన్, యాంటీ ట్రీట్ మెంట్ అందుబాటులో లేదు. కేవలం నివారణ మార్గం ఒక్కటే.. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సైంటిస్టులు చెప్పిన రెండు రీజన్స్ ఇవే :
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ పుట్టుక వెనుక రెండు కారణాలు ఉన్నాయని సైంటిస్టులు బలగుద్ది చెబుతున్నారు. సైంటిస్టులు చెప్పిన ఈ రెండు షాకింగ్ నిజాలు మరింత ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి అడవి జంతువులు, గబ్బిలాలు (#Bats) ఒక కారణమని, రెండోది వుహాన్ జీవాయుధాల ప్రయోగశాల నుంచి ఈ ప్రాణాంతక వైరస్ లీక్ అవ్వడం కారణంగానే సైంటిస్టులు గుర్తించారు.
Read Also :వెంటాడుతున్న కరోనా వైరస్.. 2,700లకు పైగా కేసులు!

కరోనా వైరస్ బయటకు రావడానికి ఈ రెండే ప్రధాన కారకాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. #Mers, #SARS అనే ఈ రెండు ప్రాణాంతక శ్వాసకోశ వ్యాధులను కలిగించే వైరస్ లతో #coronavirus ఉద్భవించిందని అంటున్నారు.

అంతేకాదు.. గబ్బిలాలను తినడం ద్వారా లేదా గబ్బిలాలను తిన్న విషపూరిత పాము మాంసాన్ని తిన్న మనుషుల ద్వారా ఈ వైరస్ సోకడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

1. మొదటి కారణం : గబ్బిలాలు + పాములతో..
వుహాన్ సిటీలో గబ్బిలాలను తిన్న పాములను ఎక్కుమంది తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి సంక్రమించడం జరిగి ఉండొచ్చు. #2019-NCoV అనే ప్రాణాంతక వైరస్.. చైనాలోని క్రయిటా పాములు, కోబ్రా పాముల్లో ఉన్నట్టుగా సైంటిస్టులు తమ పరిశోధనల్లో గుర్తించారు.

అడవిలో తిరిగే గబ్బిలాల కోసం విషపూరిత పాములు వెంటాడి మింగేస్తుంటాయి. ఈ గబ్బిలాల్లోని వైరస్.. పాముల్లోకి సంక్రమిస్తుంది. వుహాన్ సిటీలో సీఫుడ్ మార్కెట్లో ఎక్కువగా పందులు, పాములు, గబ్బిలాలు, జంతువుల మాంసం అమ్ముతుంటారు. వీటిని తిన్న మనుషుల్లోకి ఈ వైరస్ అంటువ్యాధిలా సోకి ఉంటుందని తేల్చేశారు.
map carona

జనవరి 23న వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS) అడవి జంతువుల మాంసంతో వ్యాపారం చేయడం ద్వారా ఇలాంటి వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా మారుతోందని హెచ్చరించింది. కొన్నివారాల నుంచి చైనీస్ ప్రభావితులు, వీడియో కంటెంట్, వీడియోలను విడుదల చేయడాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చైనీస్ సెలబ్రిటీ వాంగ్ మెంగ్యూమ్ 2017లో తాను వేయించిన గబ్బిలాన్ని తింటున్న వీడియోను వైరల్ చేయడంపై విమర్శలు రావడంతో క్షమాపణలు తెలియజేశారు.

2. రెండో కారణం : ల్యాబరేటరి నుంచి వైరస్ లీకేజ్..
2017లో చైనా వుహాన్ నేషనల్ బయో సేఫ్టీ ల్యాబరేటరీని స్థాపించింది. ఇక్కడ డెడ్లీ వైరస్ లకు సంబంధించి అధ్యయనాలు చేస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైరస్, వ్యాధికారక బ్యాక్టిరియాలపై పరిశోధనలు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ప్రయోగశాలల్లో చేసే ప్రయోగాల్లో ఎన్నో తప్పులు జరుగుతుంటాయని చెప్పారు.

పొరపాటున ఏ చిన్న తప్పు జరిగినా అది మానవ జాతి వినాశనానికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని న్యూజెర్సీ ఆధారిత ర్యూట్ జెర్స్ యూనివర్శిటీ మాలిక్యూలర్ బయాలిజిస్ట్ రిచార్డ్ బ్రైట్ అభిప్రాయపడ్డారు. వ్యాధికారిక జీవులు, కోతులు వంటి జంతువులపై పరీక్షలు జరిపే సమయంలో ఇలాంటి ప్రాణాంతక వైరస్ లు లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.
Read Also: కరోనా వైరస్ ఎలా పుట్టింది? పాముల నుంచి మనుషుల్లోకి ఎలా?

వుహాన్ బయో ల్యాబరేటరీలో నుంచే #coronavirus బయటకు లీక్ అయిందనే విషయాన్ని సైంటిస్టులు పూర్తిగా కొట్టిపారేయ లేకపోతున్నారు. ఎందుకంటే 2004లో #SARS అనే వైరస్ కూడా లీక్ అయింది. ఇప్పటికే హాంగ్ కాంగ్, చైనా రెండు కరోనా వైరస్ ప్రభావంతో ఎమర్జెన్సీ ప్రకటించాయి. 

జనవరి 27 వరకు అధికారికంగా 2,700 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ ప్రభావంతో దేశంలో అస్థిరత్వం నెలకొనడంతో చైనీస్ ఎకానమీ, స్టాక్ మార్కెట్లు కూడా ఒక్కసారిగా పడిపోయాయి.
Read Also : పూర్తి Visual guide మీకోసం: ‘కరోనా’ వ్యాప్తికి అసలు కారణాలు ఇవే!