షాకింగ్ ఫ్యాక్ట్స్ : ఫ్రైడ్ చికెన్ తింటే మరణమే

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 09:58 AM IST
షాకింగ్ ఫ్యాక్ట్స్ : ఫ్రైడ్ చికెన్ తింటే మరణమే

Updated On : January 28, 2019 / 9:58 AM IST

ఫ్రైడ్ చికెన్ అంటే అందరికీ నోరూరుతుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న తేడా లేకుండా.. మల్టీ నేషనల్‌ ఫుడ్ స్టోర్స్‌కు వెళ్లి.. ఎడా పెడా లెగ్‌పీస్‌లు లాగించేస్తున్న వాళ్లు బోలెడు మంది. రెగ్యులర్‌గా మనం తినే లంచ్, డిన్నర్‌కు బదులు.. చికెన్ బకెట్స్ లాగించేయడం అలవాటవుతోంది. హాట్ వింగ్స్, క్రిప్సీ చికెన్ కార్న్‌ లాంటి వెరైటీ వెరైటీ టేస్టీ ఐటెమ్స్ అందుబాటులోకి రావడంతో.. పిల్లా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫ్రైడ్ చికెన్‌కు అడిక్ట్ అవుతున్నారు. దేశంలో ఇప్పుడు ఈ స్టోర్లకు డిమాండ్ కూడా అలానే పెరుగుతోంది.

 

కానీ ఇలా ఫ్రైడ్‌ చికెన్‌ను డైలీ తినడం సేఫేనా..? దీనిపైనే ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో తాజాగా పబ్లిష్ అయిన ఓ అధ్యయనం .. ఏకంగా ఫ్రైడ్ చికెన్‌ అతిగా తింటే మృత్యువును కొని తెచ్చుకున్నట్లే అని తేల్చి చెప్పింది. ఫాస్ట్‌ఫుడ్‌ను అందులోనూ ఫ్రైడ్ చికెన్‌ను అతిగా తినే అమెరికాలో చేసిన ఈ అధ్యయనంలో ఆందోళనకరమైన ఎన్నో అంశాలు బయటపడ్డాయి. ఫ్రైడ్ చికెన్ రెగ్యులర్‌గా తినే వాళ్లలో మూడోవంతు మందికి టైప్‌ 2 డయాబెటిస్‌ సోకే ప్రమాదం ఉందట. అంతేకాదు.. గుండెజబ్బులు కూడా వచ్చే ప్రమాదం వీరికే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక ఫ్రైడ్‌ చికెన్ అతిగా తినేవాళ్లకు క్యాన్సర్‌ రిస్క్‌ అధికంగా ఉన్నట్లూ గుర్తించారు పరిశోధకులు. అతిగా ఫ్రై చేయడం.. విపరీతంగా ఆయిల్ వాడకం.. ఫ్రై చేసిన ఆయిల్‌లోనే చికెన్ పీస్‌లు ఫ్రై చేస్తూ ఉండడం.. ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు.

 

* రోజూ ఫ్రైడ్ చికెన్ లాగిస్తున్నారా
* రోజూ చికెన్ బకెట్ ఖాళీ చేయాల్సిందేనా
* మీరు డేంజర్‌లో ఉన్నట్లే
* ఫ్రైడ్‌ చికెన్‌తో ప్రాణాలకే ముప్పంటున్న వైద్యులు
* ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టిన తాజా అధ్యయనం
* ఫ్రైడ్ చికెన్ అనర్థాలపై బ్రిటీష్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం
* ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినేవారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలెక్కువ
* టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే ఛాన్స్
* క్యాన్సర్ లక్షణాలనూ గుర్తించిన పరిశోధకులు