Diabetes: డయాబెటిస్ ఉన్నవారికి ప్రోటీన్, ఫైబర్ ఆధారిత ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్.. మీరు కూడా ట్రై చేయండి

Diabetes: గ్రీన్ గ్రామ్‌లో ప్రొటీన్లు, ఫైబర్ అధికం ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతకుమించి ఇది కొలెస్ట్రాల్ లేని ఆహారం కాబట్టి గుండెకు మంచి చేస్తుంది.

Diabetes: డయాబెటిస్ ఉన్నవారికి ప్రోటీన్, ఫైబర్ ఆధారిత ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్.. మీరు కూడా ట్రై చేయండి

The best protein and fiber-based breakfast for people with diabetes

Updated On : July 18, 2025 / 11:12 AM IST

డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు తీసుకునే ఆహరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది బ్లడ్ షుగర్‌ను మెల్లగా పెంచుతుంది. కాబట్టి, ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అందులోనే ఉందయం తీసుకునే ఆహారాం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, మధుమేహం ఉన్నవారికి ఉదయం తీసుకోవాల్సిన బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహరం తీసుకోవాలి:

  • ఇవి ఆకలిని నియంత్రిస్తాయి
  • ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తాయి
  • శక్తిని రోజంతా అందిస్తాయి
  • బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంచుతాయి

షుగర్ పేషేంట్స్ కోసం బెస్ట్ బ్రేక్ ఫాస్ట్స్:

1.పెసరట్టు + మినుముల చట్నీ:
గ్రీన్ గ్రామ్‌లో ప్రొటీన్లు, ఫైబర్ అధికం ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతకుమించి ఇది కొలెస్ట్రాల్ లేని ఆహారం కాబట్టి గుండెకు మంచి చేస్తుంది. దీనితో పాటు మినుముల/చిక్కుడు చట్నీ ఉపయోగించచడం మంచిది.

2.వెజిటబుల్ ఓట్స్ ఉప్మా:
ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇందులో క్యారెట్, బీన్స్, కాప్సికం వంటివి జతచేస్తే పోషకాల విలువ పెరుగుతుంది.
అయితే ఇందులో షుగర్ కాకుండా ఉప్పుతో తయారు చేసుకోవాలి. రుచి కోసం చిల్లీ లేదా పెప్పర్ కూడా మిక్స్ వేసుకోవచ్చు.

3.జొన్న/రాగి/సజ్జ చపాతీ:
మిలెట్‌లు జొన్న/ రాగి/ సజ్జ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రొటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇది బ్లడ్ షుగర్‌ని తక్కువ చేస్తాయి. గోధుమ చపాతీ కన్నా మిలెట్ చపాతీలు మెరుగైన ఎంపిక అని చెప్పొచ్చు. దీనిలో పల్లి చట్నీ తీసుకోవడం మంచి ఎంపిక.

4.ఉడికించిన శనగలు + ఉల్లిపాయ సాలడ్:
శనగలలో GI లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది దీనిని ఉదయం టిఫిన్ గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా కూడా తినవచ్చు. ఇందులో నిమ్మరసం, మిరియాల పొడి, జీలకర్ర కలిపితే మంచి రుచిగా ఉంటుంది.

5.ఉడికించిన గుడ్లు:
ఉడికించిన గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అంతేకాదు ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కాబట్టి, ఎక్కువసేపు ఆకలిగా ఉండదు. దీంతో పాటు గ్రీన్ టీ తీసుకోవడం చాలా ఉత్తమ ఎంపిక గా చెప్పుకోవచ్చు.

బ్రేక్‌ఫాస్ట్ ప్లానింగ్ కోసం ముఖ్యమైన సూచనలు:

  • కేలరీలు 300 నుంచి 400 కేలరీలు సరిపోతాయి
  • ప్రోటీన్ కనీసం 10 నుంచి 5 గ్రాములు అందేలా చూసుకోవాలి
  • ఫైబర్ రోజుకు 25 నుంచి 30 గ్రాములు అవసరం అవుతుంది

వీటిని అస్సలు తినకండి:

  • పూరీలు, బజ్జీలు, చక్కెర కలిపిన వడలు
  • వైట్ బ్రెడ్, పులిహోర, పెరుగన్నం బ్రేక్‌ఫాస్ట్‌లో వద్దు
  • స్లీసీ క్యాఫినేటెడ్ డ్రింక్స్
  • పంచదార వేసిన టీ/కాఫీలు

డయాబెటిక్ ఫ్రెండ్లీ బ్రేక్‌ఫాస్ట్ టిప్స్:

  • ఉదయం 8:00 – 9:30AM మధ్యలో తినాలి
  • ప్లేటులో సగం కూరగాయలు ఉండాలి
  • ఒకే ఆహారాన్ని ప్రతీరోజు తినకండి. వెరైటీ ఉండాలి
  • వాకింగ్ / లైట్ యాక్టివిటీ బ్రేక్‌ఫాస్ట్ తరువాత – షుగర్ ని స్టేబిల్ చేయడంలో సహాయపడుతుంది

డయాబెటిస్ ఉన్నవారు ప్రొటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా కలిగిన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్‌ను నియంత్రించవచ్చు, శక్తివంతంగా ఉండవచ్చు, ఇతర ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఆహారంలో స్వల్ప మార్పులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గొప్ప ప్రభావం చూపుతాయి.