Healthy Tips: రాత్రి భోజనం తరువాత చేసే ఈ చిన్న పొరపాటు.. గుండెపోటుకు కారణం అవ్వొచ్చు.. జాగ్రత్త సుమీ
Healthy Tips: మనలో చాలామంది రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేస్తారు. కొంతమంది 9 గంటలకు, మరికొందరు 10 గంటలకు లేదా అంతకంటే ఆలస్యంగా తింటారు.

These small mistakes after dinner can increase the risk of heart attack
ఈ మధ్య కాలంలో చాలా మంది సడన్ గా వచ్చే గుండె సమస్యల వల్ల చనిపోతున్నారు. అయితే, ఇంతవరకు మనం గుండెపోటుకు కారణమయ్యే పెద్ద కారణాల గురించి ఎక్కువగా విన్నాం. వాటిలో కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, పొగత్రాగడం, స్థూలత్వం మొదలైనవి. అయితే, జీవితశైలిలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా దీర్ఘకాలంలో పెద్ద సమస్యలకు దారి తీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అటువంటి ఒకటి రాత్రి భోజనం చేసే తీరు. దీనివల్ల కూడా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం గురించి వివరంగా తెలుసుకుందాం.
రాత్రి భోజనంలో చేసే ఈ చిన్న పొరపాటు గుండెపోటుకు దారి తీయవచ్చు:
రాత్రి భోజనం ఆలస్యం చేయడం/నిద్రకు దగ్గరగా భోజనం చేయడం:
మనలో చాలామంది రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేస్తారు. కొంతమంది 9 గంటలకు, మరికొందరు 10 గంటలకు లేదా అంతకంటే ఆలస్యంగా తింటారు. పైగా, భోజనం చేసిన 15 నుంచి 30 నిమిషాల్లోనే పడుకుంటారు. ఇది మనకు ఓ సాధారణపు విషయంగా అనిపించినా, దీని ప్రభావం గుండె ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది.
ఇది గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది?
1.రాత్రివేళ భోజనం తరువాత మేటబాలిజం మందగిస్తుంది:
శరీర మేటబాలిక్ రేటు రాత్రి తగ్గుతుంది. ఈ సమయంలో చేసిన భోజనం పూర్తిగా జీర్ణం కాకపోవడంతో, ఫ్యాట్ డిపాజిట్స్ పెరుగుతాయి. ఇది బాడీలో ఫ్యాట్, చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది.
2.రాత్రి ఆలస్యం చేసి తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది:
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారి తీస్తుంది. ఇది కాలక్రమేణా కార్డియో వాస్కులర్ వ్యాధులకూ బీజం వేస్తుంది.
3.రాత్రి ఆలస్యం తినడం & హార్ట్ రేట్ పెరుగుతుంది:
రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల రాత్రిపూట హార్ట్‌రేట్ తగ్గకుండా ఉంటుంది. ఇది శరీర విశ్రాంతిని ఇవ్వడంలో అంతరాయం కలిగించి నిద్రలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
4.గ్యాస్, ఎసిడిటీ& హార్ట్ ఆరోగ్యం:
రాత్రి తినడం వెంటనే పడుకుంటే గ్యాస్, అసిడిటీ సమస్యలు తీవ్రంగా ఉత్పన్నమవుతాయి. ఇది కేవలం జీర్ణాశయం సమస్యలకే కాకుండా, లాంగ్ టర్మ్‌గా గుండెకు నష్టం కలిగించేలా మారుతుంది.
శాస్త్రీయ పరిశోధనలు ఏమంటున్నాయి?
బ్రెజిల్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం రాత్రి భోజనం తరువాత వెంటనే నిద్రపోతే గుండెపోటు 2 రెట్లు అధికంగా వచ్చే ప్రమాదం ఉంది. ఇంకొక అధ్యయనం ప్రకారం ఆలస్యంగా భోజనం చేసే వారు గుండెకు సంబంధించిన సడెన్ డెత్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇతర అలవాట్లు:
- నిద్రకి ముందు అధికంగా తినడం
- అధికంగా ఉప్పు/నూనెతో ఉన్న ఆహారం తీసుకోవడం
- కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే రాత్రి ఆహారం
- అల్‌కహాల్ తీసుకోవడం
- భోజనం తర్వాత తక్షణమే పడుకోవడం
సరైన అలవాట్లు:
- రాత్రి భోజనాన్ని నిద్రకి కనీసం 2 నుంచు 3 గంటల ముందు చేయాలి
- భారీ భోజనం చేయకుండా తేలికపాటి, తక్కువ కొవ్వుతో కూడిన భోజనం తీసుకోవాలి
- ఆహారం తర్వాత 10 నుంచి 15 నిమిషాలైనా నడవాలి
- జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ రాత్రివేళలో తీసుకోవద్దు