ఎండను లెక్క చేయకుండా బయట తిరుగుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..

Summer: ఈ సమ్మర్‌లో అతి చల్లటి నీరు, కూల్ డ్రింక్స్ ఏది తీసుకున్నా ఇబ్బందే అంటున్నారు నిపుణులు. బాగా..

ఎండను లెక్క చేయకుండా బయట తిరుగుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..

Summer

కాలానికి తగ్గట్లుగా సీజనల్‌ వ్యాధులు రావడం కామన్. సమ్మర్‌లో అయితే ఎండతీవ్రతతో మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతుంటాం. ఇల్లు దాటి బయటికి వెళ్లని వారు కూడా వడదెబ్బకు గురవుతారు. రెగ్యులర్‌గా తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. దీనంతటికి కారణం సరైన వాటర్ తీసుకోకపోవడమే. అంటే శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం అనారోగ్యానికి ప్రధాన కారణం అంటున్నారు డాక్టర్లు.

జూన్‌ వరకు సూర్యప్రతాపం ఇలానే ఉండే అవకాశం ఉండటంతో.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. తగినంత నీటిని తీసుకుంటూ, బాడీ టెంపరేటర్స్‌ను చెక్‌ చేసుకుంటూ కేర్‌ ఫుల్‌గా ఉండటం బెటర్‌. లేకపోతే వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలు చాలా ప్రమాదకరమంటున్నారు డాక్టర్లు. సమ్మర్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే రోగాలు ధీర్ఘకాలికంగా ఉండిపోతాయని హెచ్చరిస్తున్నారు.

చెమటలు వచ్చి..
ఎండలు ఎక్కువైనప్పుడు బాడీ టెంపరేచర్‌ కూడా పెరుగుతుంది. దాంతో మనకు చెమటలు వచ్చి శరీరం నుంచి వాటర్ వెళ్లిపోతుంది. అందుకే సమ్మర్‌లో బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటికప్పుడు వాటర్ తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే బాడీలో వాటర్‌ లెవల్స్ పడిపోయి డీహైడ్రేషన్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డైజెషన్ ప్రాబ్లమ్స్, బీపీ పెరగడం, కిడ్నీలో స్టోన్స్, ర్యాషెస్‌ వచ్చే చాన్స్ ఉంటుంది.
సమ్మర్‌లో కిడ్నీ స్టోన్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడంతో పాటు, శరీరంలో నీరు బయటకు పోతుండటంతో సమస్యలు వస్తాయి. ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీరు తగ్గినప్పుడు కండరాలు పట్టేస్తుంటాయ్, లూజ్ మోషన్స్ ప్రాబ్లమ్ కూడా వస్తూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు సరైన మోతాదులో నీటిని తాగడంతో పాటు ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఎండలో తిరగొద్దని సూచిస్తున్నారు. ఎండలో నుంచి రాగానే కూల్‌ వాటర్ తాగితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కూల్ వాటర్‌తో స్నానం చేయడం కూడా అనారోగ్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు.

ఓవర్ ఎక్సర్‌సైజ్‌ మంచిది కాదు..

ఇక సమ్మర్‌లో బాడీకి ఓవర్ ఎక్సర్‌సైజ్‌ కూడా మంచిది కాదనేది డాక్టర్ల సూచన. తగిన విరామంతో సరిపడినంత వాటర్‌ తీసుకుంటూ వ్యాయామం చేయడం బెటర్. ఈ సమ్మర్‌లో అతి చల్లటి నీరు, కూల్ డ్రింక్స్ ఏది తీసుకున్నా ఇబ్బందే అంటున్నారు నిపుణులు. బాగా చల్లగా ఉన్నవాటిని తాగితే గొంతునొప్పి, జలుబు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.

బాడీ టెంపరేచర్స్ పడిపోకుండా ఉండాలంటే సరిపడా నీరు తీసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు చల్లటి ప్రదేశాల్లో ఉండాలి. ఎక్కువ లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. బాడీకి చలువ చేసే మజ్జిగలాంటి పదార్థాలను తీసుకుంటే మంచిది. వృద్ధులు, పిల్లలు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్ల సూచన.. ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన ఆహార పదార్థాలు కాకుండా.. ఫ్రెష్‌ ఫుడ్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Gold Rate : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేటు ఎంతంటే?