యుకే, రష్యాలో రెడ్ అలర్ట్.. 10వేలకు చేరిన కరోనా కేసులు

  • Published By: sreehari ,Published On : January 31, 2020 / 03:06 PM IST
యుకే, రష్యాలో రెడ్ అలర్ట్.. 10వేలకు చేరిన కరోనా కేసులు

Updated On : January 31, 2020 / 3:06 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ నుంచి మొదలైన వైరస్ వ్యాప్తి యుకే, రష్యాలకు పాకింది. దీంతో ఆయా దేశాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూకే, రష్యాలో శుక్రవారం (జనవరి 31, 2020) తొలి నోవల్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు యూఎస్, జపాన్ దేశాలు తమ పౌరులను చైనాకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి. చైనీస్ దేశీయులకు మాస్కో క్రిమ్లిన్ వర్క్ వీసాలను తాత్కాలికంగా బ్యాన్ విధించే అవకాశం ఉంది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో యూరోప్, ఆసియాలోని స్టాక్స్ మార్కెట్లతో పాటు యూఎస్ ఫ్యూచర్లు కూడా పతనమయ్యాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గురువారమే గ్లోబల్ హెల్త్ ఎమర్జెనీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9,950కు పైగా నమోదు అయ్యాయి. గతంలో SARS వైరస్ (అంటువ్యాధి) మహామ్మారి ప్రబలిన సమయంలో నమోదైన కేసుల కంటే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయినట్టు అధికారికంగా నివేదించాయి. జర్మనీలోని మునీచ్ సమీపంలో ఆటో పార్టస్ సప్లయిర్ ఆరో వ్యక్తికి కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. ఒక చిన్నారికి ఆమె తండ్రి నుంచి వైరస్ సోకడంతో మరో కొత్త కేసు నమోదైందని బవేరియన్ హెల్త్ అధికారులు తెలిపారు.

రష్యాలో రెండు కేసులు :
ఇద్దరు చైనీ దేశీయులకు కరోనా సోకడంతో వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు డిప్యూటీ ప్రధాని తాత్యానా గొలికోవా తెలిపారు. క్రిమ్లిన్ వర్క్ వీసాలపై తాత్కాలి నిషేధం విధించింది. మంగోలియా-రష్యా సరిహద్దులో నుంచి వచ్చే చైనీయులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. చైనాకు వెళ్లే విమాన సర్వీసులను కూడా నిలిపివేసినట్టు రష్యా తెలిపింది.

ఇటలీలో ఎమర్జెనీ ప్రకటన :
ఇటలీ కేబినెట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. తమ దేశంలోని రాష్ట్రాల్లో వైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. ఇద్దరు చైనా దేశీయులకు కరోనా వైరస్ సోకడంతో వారికి రోమ్ నగరంలోని ప్రత్యేక ప్రదేశంలో చికిత్స అందిస్తోంది. తమ దేశానికి వచ్చిన 18 మంది పర్యాటకులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య అధికారులు తెలిపారు.

సింగపూర్, వియత్నాం, పాకిస్థాన్ లో ట్రావెల్ ఆంక్షలు జారీ :
కరోనా వైరస్ ప్రభావంతో చైనీయులకు సింగపూర్ ఎంట్రీ వీసాలను సస్పెండ్ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చేశాయి. వియత్నాంలో కూడా ఇదే తరహాలో వీసాలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. చైనీస్ పర్యాటల వీసాల జారీని నిలిపివేశాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా చైనా నుంచి వచ్చే పోయే అన్ని డైరెక్ట్ విమాన సర్వీసులను ఫిబ్రవరి 2 వరకు నిలిపివేసింది. చైనాతో ఉత్తర సరిహద్దులోని ఎంట్రీని కూడా మూసివేసేందుకు ప్లాన్ చేస్తోంది.

యూకేలో రెండు కేసులు నమోదు :
ఇంగ్లండ్ లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిగా అక్కడి అధికారులు వెల్లడించారు. వీరిద్దరికి కరోనా వైరస్ పాజిటీవ్ అని తేలినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూ క్యాస్టిల్ లోని స్పెషలిస్టు కేర్ లో ఆ ఇద్దరు రోగులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

ఇప్పటికే తమ దేశంలో కొత్త కరోనా వైరస్ తో మరణాల రేటు 2శాతంగా ఉందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ తెలిపారు. మరోవైప వుహాన్ నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని యూకే ప్రభుత్వం తెలిపింది. చైనా నుంచి వైరస్ లక్షణాలతో వచ్చినవారిని దూరంగా ఉంచి 14 రోజుల పాటు వారి ఆర్యోగ పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.

మార్చి 2 వరకు హాంగ్ కాంగ్ స్కూళ్లు మూసివేత :
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో హాంగ్ కాంగ్ లో మార్చి 2 వరకు స్కూల్ సెలవులను పొడిగించారు. కరోనా వ్యాప్తి పరిస్థితిని బట్టి అక్కడి స్కూళ్లను తెరవనున్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ క్యారీ లామ్ తెలిపారు. హుబేయ్ ప్రావెన్స్ నుంచి వచ్చిన పర్యాటకులను అక్కడి ప్రభుత్వం స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. వైరస్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించి పర్యవేక్షించనుంది. చైనాతో హాంగ్ కాంగ్ సరిహద్దుల్లో లామ్ ను మరోసారి మూసివేశారు.

యూఎస్ వృద్ధిపై ప్రభావం : పడిపోయిన గోల్డ్ మ్యాన్ ఎగుమతులు
కరోనా వైరస్ ప్రభావంతో అమెరికాలోని ఆర్థిక వృద్ధి తొలి త్రైమాసికంలో 0.4 శాతానికి పడిపోయింది. చైనా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యను నిరాకరించడం, ఎగుమతులు నెమ్మదించినట్టు గోల్డ్ మ్యాన్ సాచ్ గ్రూపు ఇంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా వదలిరావాలని అమెరికన్లకు యూఎస్ పిలుపు :
కరోనా వైరస్ వ్యాప్తితో చైనాకు ట్రావెల్ చేయొద్దని అమెరికన్లను యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలోని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం లెవల్ 4 ఉండగా, రవాణా సౌకర్యాల కేటగిరీపై హెచ్చరికలు జారీ చేసింది. చైనా సహా ఇతర దేశాల్లో నార్త్ కొరియా, వెనిజులా, ఇరాన్, ఇరాక్, సోమాలియా పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా యుఎస్ ఒక అడ్వైజరీ జారీ చేసింది.

గ్లోబల్ వైరస్ కేసుల్లో SARS కంటే కరోనా ఎక్కువ :
గ్లోబల్ వైరస్ కేసుల్లో ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు 9,950 కు చేరింది. అప్పట్లో SARS వైరస్ కేసుల కంటే ఇప్పుడు కరోనా కేసులే టాప్. 2003లో సార్స్ కేసుల సంఖ్య 8,096 గా అధికారిక రిపోర్టులో తెలిపినట్టు WHO తెలిపింది.