కరోనా పోలీసు ప్రిడేటర్స్.. స్మార్ట్ హెల్మట్లతో వైరస్ బాధితులను ఎలా గుర్తిస్తున్నారో చూడండి!

  • Published By: sreehari ,Published On : March 9, 2020 / 06:02 AM IST
కరోనా పోలీసు ప్రిడేటర్స్.. స్మార్ట్ హెల్మట్లతో వైరస్ బాధితులను ఎలా గుర్తిస్తున్నారో చూడండి!

Updated On : March 9, 2020 / 6:02 AM IST

చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారిసంఖ్య 3,097వేలకు చేరింది. వేలాది మందికి వైరస్ సోకి ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుండటంతో ముందుగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటోంది. చైనాలో పోలీసు అధికారులు కరోనా ప్రిడేటర్లుగా మారిపోయారు.

స్మార్ట్ హెల్మట్లను ధరించి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీధుల్లో వెళ్లే పాదాచారుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో ఈ స్మార్ట్ హెల్మట్ల ద్వారా వారి శరీర ఉష్ణోగ్రతను నమోదు చేస్తున్నారు. షెన్ జాన్ ఆధారిత కంపెనీ కుయాంగ్-చి టెక్నాలజీ ద్వారా స్మార్ట్ హెల్మట్లను డెవలప్ చేసింది. జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఎవరికైనా అసాధారణ శరీర ఉష్ణోగ్రతలు ఉంటే వెంటనే ఈ స్మార్ట్ హెల్మెట్లు పసిగట్టేస్తాయి. వీటి సిగ్నల్ ద్వారా ఆయా బాధితులను గుర్తించి వారిని ప్రత్యేక కరోనా వార్డులకు తరలిస్తున్నారు.(కరోనాను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్లు)

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు చైనా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. స్మార్ట్ హెల్మట్లతో పోలీసు అధికారులు కరోనా వైరస్ బాధితులను గుర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పీపుల్స్ డెయిలీ తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. వీడియోలో పోలీసు అధికారులు స్మార్ట్ హెల్మట్లతో పెట్రోలింగ్ నిర్వహించడం కనిపిస్తోంది. ఈ స్మార్ట్ హెల్మట్లలో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే డిటెక్టర్లు, కోడ్ రీడ్ కెమెరాలు ఉన్నాయి. జనం మధ్యలో ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే వారిని వెంటనే #coronavirus epidemicను ఈ స్మార్ట్ హెల్మట్లు గుర్తిస్తాయి.

ఐదు మీటర్ల దూరంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వెంటనే ఈ హెల్మట్ల నుంచి అలారం మోగుతుంది. అంతే.. ఆ వ్యక్తిని తీసుకెళ్లి ప్రత్యేకవార్డుల్లోకి తరలిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా రోబోకాప్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు.. కరోనా ప్రిడేటర్లు అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చైనాలో కరోనా వైరస్ సోకి కొత్తగా మరో 27 మంది మృతిచెందినట్టు ఓ రిపోర్టు తెలిపింది. నెలకుపైగా వ్యవధిలో అతి తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయి.