కల్తీ నెయ్యిని ఎందుకు తినకూడదు? ఎలాంటి జబ్బులు వస్తాయి? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

కల్తీ నెయ్యికి ఎందుకు దూరంగా ఉండాలి? అలాంటి నెయ్యిని తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటి?

కల్తీ నెయ్యిని ఎందుకు తినకూడదు? ఎలాంటి జబ్బులు వస్తాయి? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

Adulterated Ghee Health Problems (Photo Credit : Google)

Updated On : September 23, 2024 / 1:06 AM IST

Adulterated Ghee Health Problems : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెద్ద దుమారమే రేపింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని తెలిసి భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ నెయ్యి వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఘోరమైన అపచారం జరిగిందని భక్తులు వాపోతున్నారు.

కల్తీ నెయ్యి ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. మనం రోజూ అన్నంలో కలుపుకుని తినే నెయ్యి స్వచ్ఛమైనదేనా? కాదా? అసలు నెయ్యి స్వచ్చతను గుర్తించడం ఎలా? నెయ్యి కల్తీ అయ్యిందా లేదా తెలుసుకోవడం ఎలా? అనే సందేహం ప్రతి ఒక్కరిని వేధిస్తోంది.

అదే సమయంలో కల్తీ నెయ్యిని తింటే ఏమవుతుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? దాన్ని వల్ల వచ్చే జబ్బులు ఏంటి? అన్నది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కల్తీ నెయ్యికి ఎందుకు దూరంగా ఉండాలి? అలాంటి నెయ్యిని తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటి? 

  • కల్తీ నెయ్యిలో తరచుగా స్టార్చ్, హైడ్రోజనేటెడ్ కొవ్వు లేదా ఇతర తక్కువ నాణ్యత నూనెలు కలిగి ఉంటుంది. ఇలాంటి నెయ్యిని తింటే.. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
  •  కల్తీ నెయ్యిలో హైడ్రోజనేటెడ్ నూనెల నుండి అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండొచ్చు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
  •  కల్తీ నెయ్యి కారణంగా అలెర్జీ సమస్యలు వస్తాయి. కల్తీ ప్రక్రియలో ఉపయోగించే కొన్ని కెమికల్స్ కారణంగా దద్దుర్లు నుండి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.
  • స్వచ్ఛమైన నెయ్యిలో అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కల్తీ చేసిన వాటిలో ఈ పోషకాలు ఉండవు. ఇది దృష్టి లోపానికి దారి తీస్తుంది. ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
  • కల్తీ నెయ్యిలో.. స్వచ్ఛమైన నెయ్యికి ఉండే గొప్ప, ప్రామాణికమైన రుచి ఉండదు. వంటకాల రుచిని, నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అన్నంలో కలుపుకుని తిన్నా.. ఆ రుచి మనకు లభించదు.                                                                                                                                                                                                                                                Also Read : కల్తీ నెయ్యిని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా గుర్తించాలి? పూర్తి వివరాలు…