ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే..

  • Published By: Subhan ,Published On : April 30, 2020 / 10:52 AM IST
ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే..

Updated On : April 30, 2020 / 10:52 AM IST

మనం చాలా మంది ఇంటి ముందు దిష్టి పోతుందనే గుమ్మడికాయను వేలాడదీస్తుంటాం. కానీ, ఉదయాన్నే ఈ డిటాక్సిఫై ఏజెంట్‌ను తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా.. శరీరంలో ఉన్న టాక్సిన్లు, క్రిములు, వ్యర్థ పదార్థాలను గ్రహించి విసర్జక వ్యవస్థ నుంచి బయటకు పంపేస్తాయి. అంతర్గత వ్యవస్థ ఇటే శుద్ధి అవుతుంది. 

ఇందులో ఉన్న కాల్షియం, ఐరన్, పాస్పరస్, విటమిన్ సీలు శరీరానికి మరింత లాభాన్ని చేకూరుస్తాయి. అయితే దీని జ్యూస్ చేసేముందు విత్తనాలను తీసేయాల్సి ఉంటుంది. మలబద్ధకంతో బాధపడుతున్నవారు, జీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది సరైన మందు. 

దీనిని పొడిగా చేసుకుని కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, ఉసిరి రసంతో పాటు తాగాలి. గ్యాస్ట్రోఎంట్రిక్ సమస్యలు ఉన్నా.. కొబ్బరిపాలతో పాటు తీసుకుంటే కచ్చితంగా ఉపశమనం వస్తుంది. ఫిటోటేరాపియా స్టడీ ప్రకారం.. మార్ఫిన్ లెవల్స్ ను కూడా ఈ జ్యూస్ కంట్రోల్ చేస్తుంది. డైలీ తాగడం వల్ల మాదక ద్రవ్యాలకు బానిస అయిన వాళ్లు కూడా వ్యసనాన్ని మానుకుంటారు. 

తక్కువ బరువు ఉన్నవాళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగితే మెటబాలిజం మెరుగై పోషక విలువలు అందుకుంటారు. ఎనరోక్సియా, ఆహారం తీసుకోవడం మందగించిన వాళ్లకు బూడిద గుమ్మడికాయ జ్యూస్.