Kidney Stone Remedies: కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇంట్లోనే పరిష్కారం.. ఇవి ఫాలో అవడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు
Kidney Stone Remedies: శరీరానికి సరిపడా నీరు అందించాలి. రోజుకు కనీసం 8 నుంచి10 గ్లాసుల నీరు త్రాగడం వల్ల కిడ్నీలోని విషపదార్థాలు బయటకు పోతాయి.

With this little tip, you can solve the problem of kidney stones at home.
కిడ్నీలు మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, విషపదార్థాలను మూత్రం రూపంలో శారీరం నుంచి బయటకు పంపుతాయి. సరైన ఆహారం, జీవనశైలి పాటించకపోవడం వవల్ల కిడ్నీలపై భారం పెరుగుతుంది. దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. వాటిలో కిడ్నీ స్టోన్స్ (Kidney Stones), ఇన్ఫెక్షన్లు, ద్రవ నిల్వ, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి ఉన్నాయి. అయితే, ఈ సమస్య ప్రారంభ దశలలోనే గుర్తిస్తే సహజ మార్గాలలో తగ్గించుకోవచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యల సాధారణ లక్షణాలు:
- తరచూ మూత్రం రావడం
- మూత్రంలో రక్తం లేదా దుర్వాసన రావడం
- ఒళ్లు ఊపిరాడకపోవడం, ముఖం/కాళ్ళు ఉబ్బడం
- నడుము భాగంలో నొప్పి రావడం
- అలసట, మానసిక అసహనం తలెత్తడం
ఇంట్లోనే పాటించదగిన సహజ చిట్కాలు:
1.నీరు ఎక్కువగా త్రాగాలి:
శరీరానికి సరిపడా నీరు అందించాలి. రోజుకు కనీసం 8 నుంచి10 గ్లాసుల నీరు త్రాగడం వల్ల కిడ్నీలోని విషపదార్థాలు బయటకు పోతాయి. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా సహాయపడుతుంది.
2.ఉల్లిపాయ, వెల్లుల్లి వినియోగం:
ఉల్లిపాయ, వెల్లుల్లి ఆహారాల్లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటిలో ఉండే అలిసిన్ (Allicin) యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటంతో కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయ మూత్ర వృద్ధిని ప్రేరేపిస్తుంది, డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది.
3. పసుపు:
పసుపు సహజ యాంటిబయోటిక్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే కర్క్యూమిన్ (Curcumin) వాపు, ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది మూత్రనాళం వాపు (UTI)లను తగ్గిస్తుంది.
4.నిమ్మరసం:
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్, మూత్రంలో ఉన్న క్యాల్షియం సమతుల్యం చేసి కిడ్నీ రాళ్లను నిరోధిస్తుంది. రోజుకు ఒకటి రెండు గ్లాసుల నిమ్మరసం తాగడం మంచిది.
5.పుచ్చకాయ, దోసకాయ రసాలు:
పుచ్చకాయ, దోసకాయ రసాలు మూత్ర విసర్జనను పెంచుతాయి. దీనివల్ల కిడ్నీలోని ఉప్పులు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. పుచ్చకాయలో 90 శాతం పైగా నీరు ఉండటంతో ఇది శక్తివంతమైన మూత్రవిసర్జకంగా (diuretic) పనిచేస్తుంది.
6.ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి:
అధిక ఉప్పు వాడకం కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. సల్టెడ్ స్నాక్స్, ఫ్రోజెన్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లాంటివి తినడం పూర్తిగా తగ్గించాలి.
7.వ్యాయామం చేయడం:
నడక, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి. అర్థమత్స్యేంద్రాసనం, భుజంగాసనం వంటి యోగా ఆసనాలు కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి ప్రభావం చూపుతాయి.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి:
- మూత్రంలో రక్తం కనిపించడం
- తీవ్రమైన నడుము నొప్పి
- ఎడమ/కుడి పక్కవైపు తీవ్ర నొప్పి
- అధిక జ్వరంతో పాటు మూత్ర ఇబ్బందులు
కిడ్నీ ఆరోగ్యం పరిరక్షించాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఇంట్లోనే కొన్ని సరళమైన మార్గాలను పాటించడం వల్ల ప్రారంభ దశల కిడ్నీ సమస్యలని కట్టడి చేయవచ్చు.