World Food Safety Day 2024 : గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు.. ఫెర్నాండెజ్ సంరక్షణ పద్ధతులు

World Food Safety Day 2024 : ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కోసం సురక్షితమైన ఆహారపు అలవాట్లపై ఆచరణీయ సూచనలను విడుదల చేసింది.

World Food Safety Day 2024 : గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు.. ఫెర్నాండెజ్ సంరక్షణ పద్ధతులు

World Food Safety Day 2024 ( Image Credit : Google )

World Food Safety Day 2024 : హైదరాబాద్ జంట నగరాల్లో గర్భిణీ, స్త్రీలలో గ్యాస్ట్రోఎంటెరిటిస్, లూజ్ స్టూల్స్, జాండిస్ (కామెర్లు) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కోసం సురక్షితమైన ఆహారపు అలవాట్లపై ఆచరణీయ సూచనలను విడుదల చేసింది.

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!

ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం అధిపతి డాక్టర్ లతా శశి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “ఈ ఏడాదిలో ‘ప్రిపేర్‌ ఫర్‌ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌’ థీమ్‌తో గర్భిణీ స్త్రీలకు ఆహార భద్రత ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆమె చెప్పారు. తల్లిగా మారాలనుకనే మహిళలు గ్యాస్ట్రోఎంటెరిటిస్, కామెర్లు, లూజ్ స్టూల్స్ వంటి అనారోగ్య పరిస్థితులను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లతా శశి సూచించారు.

గర్భిణీలు అనుసరించాల్సిన కొన్ని ప్రధాన ఆహార భద్రతా చర్యలివే :

  • బయట భోజనం చేయాల్సిన సమయంలో పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లండి. వీటిని గుర్తించడానికి ఆన్‌లైన్ రివ్యూలను చదివి తెలుసుకోండి.
  • తాజాగా వండిన వేడివేడిగా వడ్డించే వంటకాలను ఆర్డర్ చేయండి.
  • సురక్షితమైన సీలింగ్‌ లేదా వేడి చేసిన నీళ్లను మాత్రమే బాటిల్స్‌లో వినియోగించండి.
  • సీ ఫుడ్‌ తీనే సమయంలో మంచిగా వండారా లేదా అనేది పరీక్షించండి. లేదంటే ప్రమాదకరమైన బాక్టీరియా దరిచేరుతుంది.
  • ఫుడ్‌ స్టోర్‌లు లేదా బఫేల నుంచి ముందస్తుగా ప్యాక్ చేసిన సలాడ్‌లు, ఆహార పదార్థాలను నివారించండి.
  • ఎప్పటి నుంచో ఆరుబయట ప్రదర్శించి ప్రమాదకర సూక్ష్మజీవులను నింపుకుని ఉంటాయి.
  • తినే ముందు సబ్బు, నీటితో చేతులను శుభ్రంగా కడగాలి.
  • సబ్బు, నీరు అందుబాటులో లేనట్లయితే కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించండి.
  •  ముఖ్యంగా ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం శ్రేయస్కరం.
  •  బయట తినే పచ్చి ఆహారాలు, ముఖ్యంగా పానీయాలు (పానీ పూరీ రసం, జల్ జీరా, చెరకు రసం, మొలకలు, స్ప్రౌట్స్‌ వంటివి) మానుకోండి.
  •  మిగిలిపోయిన వాటిని తినడం మానేయండి. ప్రత్యేకించి వాటిని సరిగ్గా నిల్వచేయకుండా మళ్లీ వేడి చేసి తినడం అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి.

ఈ మార్గదర్శకాలతో పాటు ‘ప్రిపేర్‌ ఫర్‌ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌’ను ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యానికి, వారి బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదాలను తగ్గించే సురక్షితమైన  భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి.

Read Also : Heart Health Foods : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అద్భుతమైన 5 ఆహారాలివే..!