Lavu Srikrishna Devarayalu : టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు నియామకం

Lavu Srikrishna Devarayalu : ఈసారి లోక్‌సభలో టీడీపీకి 16 ఎంపీల బలం ఎక్కువగా ఉండటంతో ఏపీకి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Lavu Srikrishna Devarayalu : టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు నియామకం

CM Chandrababu Selects Lavu Srikrishna Devarayal leader of the tdp ( Image Source : Google )

Lavu Srikrishna Devarayalu : తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బైరెడ్డి శబరి, దగ్గుమళ్ల ప్రసాద్ రావును ఏపీ సీఎంనియమించారు. పార్టీ కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు నియమించారు.

Read Also : పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్.. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు

అదేవిధంగా, పార్లమెంటరీ పార్టీ విప్‌గా గంటి హరీష్ నియామతులయ్యారు. ఈసారి లోక్‌సభలో టీడీపీకి 16 ఎంపీల బలం ఎక్కువగా ఉండటంతో ఏపీకి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ప్రతి ఎంపీ ప్రథమ కర్తవ్యంగా భావించాలని చంద్రబాబు తెలిపారు. జూన్ 24నుంచి ప్రారంభం కానున్న లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన పార్టీ వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఆఫీసులో జరిగిన టీడీపీ పార్లమెంటరీ భేటీలో టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో ప్రతీ ఎంపీ కేంద్రంలో ఒక్కో శాఖను కేంద్రంలో రాష్ట్రంలో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.

దేశంలో ఉన్న టాప్ 10 యూనివర్శిటీలు, ఆసుపత్రులు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, అమరావతి, అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేపై దృష్టి పెట్టాలని సూచించారు. పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారుల అభివృద్ధిపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.

Read Also : కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తులు చేసిన తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు