వైభవంగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీ 21వ వార్షికోత్సవ వేడుకలు

Kinnera Welfare Society: మొక్క వోని దీక్షతో అనాథలకు కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ నాగ చంద్రిక అండగా నిలుస్తున్నారని మైహోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు అభినందించారు.

వైభవంగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీ 21వ వార్షికోత్సవ వేడుకలు

Kinnera Welfare Society

ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమ ఆవరణలో కిన్నెర వెల్ఫేర్ సొసైటీ 21వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. 21 ఏళ్లుగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు అభినందించారు. దిక్కూ.. మొక్కూ లేని ఎంతో మంది అనాథలకు కిన్నెర వెల్ఫేర్ సొసైటీ అండగా నిలిచిందని ప్రశంసించారు. స్వలాభం చూసుకోకుండా అభాగ్యులకు ఓ మహిళ ఆపన్నహస్తం అందించడం మంచి పరిణామం అని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి కొనియాడారు.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమ ఆవరణలో కిన్నెర వెల్ఫేర్ సొసైటీ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, మైహోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతి రావు హాజరయ్యారు.

సేవలను కొనియాడిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
ఈ సందర్భంగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవలను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి కొనియాడారు. కిన్నెర వెల్ఫేర్ ఫౌండర్, ప్రెసిడెంట్ నాగ చంద్రికను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అభినందించారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయిన నాగచంద్రిక ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మంచి పరిణామం అని ప్రశంసించారు. 21 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. అనాధలను, వృద్ధులకు నాగచంద్రిక అండగా నిలిచారని అన్నారు.

మొక్క వోని దీక్షతో అనాథలకు కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ నాగ చంద్రిక అండగా నిలుస్తున్నారని మైహోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు అభినందించారు. ముచ్చింతల్‌లో వెల్ఫేర్ సొసైటీకి స్థలం కావాలని తమను అడిగారని.., అమె చేసే సేవా కార్యక్రమాలు చూసి చేదోడు వాదోడుగా ఉండేందుకు తమ వంతు సహకారం అందించామన్నారు. 21 ఏళ్లుగా అనాథలకు అన్నీ తానై నాగచంద్రిక పనిచేయడం గొప్ప విషయమని కొనియాడారు.

ముచ్చింతల్ గ్రామస్తులు నాగచంద్రికకు తగినంత సహాయం చేయాలని కోరారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కిన్నెర వెల్ఫేర్ సొసైటీని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో మరికొందరు భాగస్వామ్యం కావాలని మైహోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతి రావు కోరారు.

ముచ్చింతల్‌లో కిన్నెర వెల్ఫేర్‌ సొసైటీకి శాశ్వత భవనం కోసం స్థలం ఇచ్చిన మైహోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావుకు నాగచంద్రిక కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు, అనాథలకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని అడిగిన వెంటనే పెద్ద మనస్సుతో జూపల్లి జగపతి రావు భవనం కోసం స్థలం ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రస్తుతం కాలంలో మానవ సంబంధాలు మరీ బలహీనమయ్యాయి. వృద్ధులు, ఏ అండా దండా లేని అనాథలు నిరాదరణకు లోనవుతున్నారు. అలాంటి వారికి మేం ఉన్నామని భరోసా కల్పిస్తోంది కిన్నెర వెల్ఫేర్ సొసైటీ. ఎంతో మందిని అక్కున చేర్చుకుని వారి బాగోగులు చూస్తోంది. అభాగ్యులకు అపన్న హస్తం కల్పిస్తున్న కిన్నెర వెల్ఫేర్ సొసైటీకి ఆలయంగా మారింది ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమం. శాశ్వత భవనం నిర్మించి పేదలు, అనాథలకు ఆశ్రయం కల్పించింది.

TTD Tickets : ఆ వార్తలు అవాస్తవం.. శ్రీవారి దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు : టీటీడీ