కిరాణా సరుకులకు శానిటైజేషన్ అవసర్లేదు

కిరాణా సరుకులకు శానిటైజేషన్ అవసర్లేదు

Updated On : March 28, 2020 / 5:30 AM IST

లాక్ డౌన్ సమయంలో సెల్ప్ ఐసోలేషన్ కు వెళ్లిపోయి చాలా మంచి పని చేశామనుకుంటున్న వాళ్లు.. మరి నిత్యవసర వస్తువులు కొనుగోలు కోసం ఏం చేస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చి అమ్మేవాళ్లు, లేదా కుటుంబంలో ఎవరో ఒకరే వెళ్లి కొనుగోలు చేస్తున్న వాళ్లు అవి ఇంటికి తెచ్చుకుని ఏం చేస్తున్నారు. వాటిపైనా కరోనా వైరస్ ఉండొచ్చేమోనని కడుగుతూ కూర్చోకండి. వాటికి శానిటైజేషన్ అవసరమే లేదంటున్నారు. ఎందుకంటే వాటిపై వైరస్ ఉండే లక్షణాలు సున్నా శాతం మాత్రమేనట. 

ఒకవేళ ఏదైనా అనుమానంతో శానిటైజ్ చేయాలనుకుంటే ఏం చేయాలోననే సూచనలిస్తున్నారు. వైరస్ అనేది 17రోజుల పాటు సర్ఫేస్‌లపై సజీవంగానే ఉంటుంది. అయితే ఈ వైరస్ మనుషులపై అటాక్ చేయలేదు. ఒకవేళ చేసినా చేయొచ్చు. అందుకనే నిల్వ చేయాలనుకునే పదార్థాలను గ్యారేజీలో మూడు రోజుల పాటు ఉంచితే ఎటువంటి శానిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే పండ్లు, కూరగాయలు లాంటి వాటిని కచ్చితంగా నీళ్లతో కడగటమే మంచిది. 

 

సబ్బుతో వాటిని కడగకూడదు. అలా చేస్తే వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదముంది. అయితే ఆహార పదార్థాల నుంచి వెంటనే వైరస్ అటాక్ కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తప్పనిసరిగా పాటించాలి.

  • గ్రోసరీ స్టోర్ కు వెళ్లేముందే చేతులు శానిటైజ్ చేసుకోవాలి.
  • స్టోర్ లో ఎక్కువ సమయం గడపకుండా ఎవరితోనూ కలవకుండా బయటకు వచ్చేయాలి.
  • కూరగాయలు, పళ్లు చన్నీటితో కడగాలి.
  • తరచూ చేతులు కడుక్కుంటూ ఉండాలి. ప్రత్యేకంగా ప్యాకేజీలను పట్టుకునేటప్పుడు ఇవి తప్పకుండా చేయలి.

కిరాణా సరుకులు పట్టుకునేటప్పుడు తప్పకుండా ఈ రెండు పనులు చేయాలి. ఒకటి వాటిపై వైరల్ పార్టికల్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. రెండోది అవి ముట్టుకుంటే మనకు వైరస్ వస్తుందా అని చెక్ చేసుకోవాలి.. ఈ ప్రమాదాన్ని చాలా రకాలుగా అడ్డుకోవచ్చు. తరచూ చేతులు కడుక్కోవడం, ప్యాకేజీలు పట్టుకునేటప్పుడు కచ్చితంగా, తినే ముందు తప్పనిసరిగా చేయాలి. 

Also Read | షాకింగ్ న్యూస్ : బూట్లపై కరోనా వైరస్