దిశ హంతకులు మరో 9మందిని అలాగే చంపేశారు

హత్యలనుమహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల సమీపంలో చేసినట్లు నిందితులు అంగీకరించారు. ప్రతి ఘటనలోనూ అత్యాచారం జరిపి చంపేసి కాల్చేశారు. 

దిశ హంతకులు మరో 9మందిని అలాగే చంపేశారు

Updated On : December 18, 2019 / 3:09 AM IST

హత్యలనుమహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల సమీపంలో చేసినట్లు నిందితులు అంగీకరించారు. ప్రతి ఘటనలోనూ అత్యాచారం జరిపి చంపేసి కాల్చేశారు. 

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో మరో సంచలన కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివర్లలోని శంషాబాద్ రింగు రోడ్డులో వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం జరిపి హత్య చేశారు నలుగురు వ్యక్తులు. తర్వాత మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో సీన్ రీ కనస్ట్రక్షన్‌లో భాగంగా పారిపోడానికి ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో చంపేశారు పోలీసులు. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా దిశ నిందితులు ఇలాంటి నేరాలే 9 చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దిశ హత్యాచారం జరిగిన తర్వాత ముందుగా జరిపిన విచారణలో నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. వారు చెప్పిన వివరాలు షాకింగ్‌కు గురిచేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మొహమ్మద్ ఆరీఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులలో ఇద్దరు తొమ్మిది మందిని రేప్ చేసి కాల్చి చంపేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. 

ఈ హత్యలను మహబూబ్‌నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల సమీపంలో చేసినట్లు నిందితులు అంగీకరించారు. ప్రతి ఘటనలోనూ అత్యాచారం జరిపి చంపేసి కాల్చేశారు. వాంగ్మూలం మేరకు జరిపిన విచారణలో ఈ ప్రాంతాల్లో మొత్తం 15ఘటనలు జరిగినట్లుగా గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల నివేదికలను పరిశీలిస్తున్నారు. చాలా కేసుల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షలకు వీలు కావడం లేదని పోలీసులు తెలిపారు. 

శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ధారించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. హైవేలకు అనుకొని ఉన్న ప్రాంతాల్లో జరిగిన 15 హత్య కేసుల వివరాలను సేకరిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా చార్జిషీట్‌లో నిందితులు పాల్పడిన హత్యలకు సంబంధించిన వివరాలను పొందుపరిచే అవకాశం ఉంది.