TSRTCలో 2వేల 80బస్సుల కోత

TSRTCలో 2వేల 80బస్సుల కోత

Updated On : January 8, 2020 / 11:15 PM IST

తెలంగాణ ఆర్టీసీలో బస్సుల సంఖ్య భారీగా తగ్గనుంది. నష్టాలు ఎక్కువగా వస్తున్నాయనే కారణంతో అధికారులు ఇంతకుముందే 800బస్సులు తగ్గించారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒక వెయ్యి 280బస్సులను కూడా రద్దు చేయనున్నారు. మొత్తంగా 2వేల 80బస్సుల సర్వీసులు ప్రజలకు దూరం కానున్నాయి. ఇది రాష్ట్ర రవాణాపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. 

నష్టాల నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ బస్సులు తగ్గించి అద్దె బస్సులను ప్రవేశపెట్టే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2వేల 100 అద్దె బస్సులు ఉండగా, వీటికి అదనంగా మరో 15 రోజుల్లో వెయ్యి 334 బస్సులు రానున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే టెండరు ఫినిష్ అయింది. నెలాఖరు కల్లా అవి రోడ్డెక్కనున్నాయి. 

కొత్తగా నగరంలో 54 అద్దె బస్సులు చేరనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 800 గ్రామాలకు బస్సు వసతి లేకుండా పోయింది. అద్దె బస్సుల నిర్వాహకులు లాభాలు వచ్చే రూట్లలోనే బస్సులను తిప్పుతారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి బస్సులు ఉండడం కష్టమే. ఏయే ఊళ్లకు బస్సుల్లేవో ఎప్పటికప్పుడు గుర్తించి హేతుబద్ధీకరించటం ద్వారా షెడ్యూల్స్‌లో మార్పుచేర్పులు చేసి ఆయా ప్రాంతాలకు నడుపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.