24 గంటలు మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్: ఏప్రిల్ 19న హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జనార్‌లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబద్ పరిధిలోని బార్లు, మద్యం, కల్లు దుకాణాలు..బెల్ట్ షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్
కాగా హైదరాబాద్ భిన్న మతాల సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతోంది. ఏ మతానికి సంబంధించిన వేడుకలైన పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. ఆయా మతాల..సంప్రదాలకు అనుగుణంగా నగరంలో శాంతి భద్రతల రీత్యా వేడుకలకు సహకరిస్తు తమ విధులను నిర్వర్తిస్తుంటారు. 2019, ఏప్రిల్ 19 శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర కొనసాగనున్న క్రమంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలకు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీచేశారు.