దీపావళి విషాదం : 42మందికి గాయాలు..

  • Published By: veegamteam ,Published On : October 28, 2019 / 05:17 AM IST
దీపావళి విషాదం : 42మందికి గాయాలు..

Updated On : October 28, 2019 / 5:17 AM IST

హైదరాబాద్ నగరంలో దీపావళి పండుగ మరోసారి విషాదాన్ని కలిగించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే హెచ్చిరించినా ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి.   దీపావళికి టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు 42మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు. వీరిని మెహిదీపట్నం సమీపంలోని సరోజినీ కంటి ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. టపాసులు కాలుస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడి కంటిలో పడటంతో  ఈ ప్రమాదం జరిగింది.  

సరోజినిదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపిన  వివరాల ప్రకారం.. టపాసులు కాలుస్తున్న 42 మందికి కళ్లకు గాయాలయ్యాయి. వీరిలో ఏడురికి తీవ్రంగా గాయాలయ్యాయి. నలుగురు పెద్దవారు కాగా ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. 

వారికి తక్షణమే చికిత్స చేపట్టామన్నారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనీ..కానీ ప్రతీ ఏడాది ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. గత సంత్సరం కంటే ఈ సంవత్సరం గాయపడి హాస్పిటల్ కు వచ్చిన వారు తగ్గారన్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురికీ ప్రత్యేక పరీక్షలు చేస్తున్నామనీ..అవసరమైన ఆపరేషన్ చేస్తామని తెలిపారు.