తెలంగాణలో 5 లక్షల రేషన్ కార్డులు రద్దు

తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణి శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం గుర్తించింది.
2016 నుంచి 2018 మధ్య మొత్తం 5,21,790 కార్డులను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపింది. ఈ కార్డులన్నీ 2016లోనే రద్దు చేశారని, ఆ తర్వాత రెండేళ్లలో మాత్రం రేషన్ కార్డులు రద్దు కాలేదని వెల్లడించింది.