పెరిగిన అవినీతి కేసులు : తెలంగాణ వ్యాప్తంగా 173 ఏసీబీ కేసులు
తెలంగాణలో అవినీతి కేసులు పెరిగాయి. 2018తో పోలిస్తే ఈ ఏడాది 173 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణలో అవినీతి కేసులు పెరిగాయి. 2018తో పోలిస్తే ఈ ఏడాది 173 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో అవినీతి కేసులు పెరిగాయి. 2018తో పోలిస్తే రాష్ట్రంలో అవినీతి కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణలో ఈ ఏడాది 173 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. 2018లో వ్యాప్తంగా 139 అవినీతి కేసులను ఏసీబీ నమోదు చేయగా.. 2019లో ఈ సంఖ్య 173కు చేరింది. అత్యధికంగా రెవెన్యూ శాఖలో 54 కేసులు నమోదు చేశారు.
హోంశాఖలో 18, మున్సిపల్ శాఖలో 25, పంచాయతీరాజ్ శాఖలో 10, విద్యుత్ శాఖకు చెందిన 12 మంది ఉద్యోగులపై కేసులు నమోదు అయ్యాయి. హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్ మెంట్ లో 13, న్యాయశాఖలో 5, ఇరిగేషన్ శాఖలో 3, విద్యాశాఖలో 4, రోడ్డు రవాణా శాఖలో 3 కేసులను ఏసీబీ నమోదు చేసింది.
2019లో నమోదైన ఏసీబీ కేసుల సంఖ్యను పరిశీలిస్తే రెవెన్యూ శాఖలో అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది రెవెన్యూ శాఖలో 37 అవినీతి కేసులు నమోదైతే.. ఈ ఏడాది అత్యధికంగా 54 కేసులు నమోదయ్యాయి. అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉండగా 25 కేసులతో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ రెండో స్థానంలో నిలిచింది.