దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, బండి సంజయ్ సవాల్

bandi sanjay: తన సంతకాన్ని టీఆర్ఎస్ ఫోర్జరీ చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆరోపించారు. పైగా తప్పుడు ప్రచారంతో టీఆర్ఎస్ నేతలు బీజేపీని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీ లేఖ రాయలేదని చెప్పిందని బండి సంజయ్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ చెప్పినట్టే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నడుచుకుంటోందని బండి సంజయ్ అన్నారు. తనను అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందన్నారు.
హైదరాబాద్ లో వరద సాయం ఆపాలని ఈసీకి నేను లేఖ రాయలేదని బండి సంజయ్ మరోమారు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని బండి సంజయ్ అన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే మరింత భయం పట్టుకుందన్నారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ధర్నా చేస్తే దానిపైనా విమర్శలు చేస్తున్నారని, అసలు అక్కడికి ఎందుకు పోకూడదో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా లేక బంగ్లాదేశ్ లో ఉందా లేక ఆప్ఘనిస్తాన్ లో ఉందా అని అడిగారు. అసలు భాగ్యనగరానికి పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి టెంపుల్ వల్ల. ఇప్పుడది శక్తివంతమైన, పవిత్రమైన ఆలయం. ఒక ధార్మిక క్షేత్రం.
https://10tv.in/bjp-leader-buddha-srikanth-violates-corona-rules-bathing-in-tungabhadra-pushkarghat/
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన హిందువు అనుకున్నా, కచ్చితంగా భాగ్యలక్ష్మి దేవాలయానికి వస్తారని అనుకున్నా అని బండి సంజయ్ అన్నారు. తనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.