నగ్న చిత్రాలు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తా…..భార్యను బెదిరిస్తున్న సినీ రచయిత

కుటుంబ కలహాలతో విడిపోయిన భార్య పెట్టిన కేసు వాపసు తీసుకోమని…. లేకపోతే నీ వ్యక్తిగత చిత్రాలు యూ ట్యూబ్ లో పెడతానని బెదిరిస్తున్న సినీ రచయితపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బంజారా హిల్స్, రోడ్డు నెంబరు12 లోని ఎన్బీటీ నగర్ లోనివసించే సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్, అదే ప్రాంతంలో నివసించే యువతిని(24) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం గడిచాక భార్యతో విభేదాలు వచ్చి ఇద్దరూ వేరు వేరుగా నివసిస్తున్నారు.
https://10tv.in/lavakusa-nagaraju-passes-away/
ఇందుకు సంబంధించి ఆమె గతేడాది జూన్ లో రమణపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు ఫోన్లు చేసి కేసు వాపస్ తీసుకోవాలని….. లేదంటే ఆమె నగ్న చిత్రాలు యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తానని బెదిరించటం మొదలెట్టాడు.
దీంతో రమణ భార్య, సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సోదరి సినీ పరిశ్రమలోనే ఉందని ఆమె స్నేహితులవద్ద తన సోదరి గురించి అసభ్య కరంగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కోంది. యర్రంశెట్టి రమణపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.