తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క 

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 04:05 PM IST
తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క 

Updated On : January 18, 2019 / 4:05 PM IST

హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. ఆయన పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేసింది. భట్టి విక్రమార్కకే రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చారు. నలుగురు పోటీలో ఉన్నప్పటికీ భట్టి విక్రమార్క వైపు అధిష్టానం మొగ్గచూపింది. ఆయన నియామకంపై అనేక సమీకరణలున్నాయని తెలుస్తోంది. దళిత సమాజిక వర్గానికి చెందిన వాడు. గతంలో జరిగిన అసెంబ్లీలో ఆయన పర్ఫార్మెన్స్ బాగా ఉందనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చింది.

మధిర నుంచి భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరుసగా మూడు సార్లు మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. మొత్తం నాలుగు టర్మ్ లుగా సభా వ్యవహారాలపై ఆయనకు అనుభవం ఉంది. అనుభవం, పని తీరు ఆధారంగా భట్టికి సీఎల్పీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ చీఫ్ విప్ గా పని చేశారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగారు. భట్టి విక్రమార్క సీఎల్సీ నేతగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రేపు జరుగనున్న బీఏసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.