రూ.8 కోట్లకు లెక్కలు పక్కా : BJP కి ఐటీ క్లియరెన్స్
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలలో భాగంగా రూ.8 కోట్లను స్వాధీనంచేసుకున్నారు. ఈ నగదుకు ఇన్ కమ్ ట్యాక్ డిపార్ట్ మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనికి సబంధించి ఓ ప్రకటన కూడా చేసింది. దీనిపై ఇన్ కమ్ ట్యాక్ డిపార్ట్ మెంట్ అధికారులు మాట్లాడుతు..ఈ నగదుకు బీజేపీ నాయకులు అన్ని లెక్కలు చూపారని పోలీసులకు తెలిపారు.
Read Also : చంద్రబాబు ఆగ్రహం : అందరూ కలిసి టీడీపీపై కుట్రలు, ఏపీని బీహార్ చేస్తారా!
ఈ నెల 8న నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి చెక్కుతో రూ.8కోట్లు డ్రా చేశారు. వాటిని తరలిస్తుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఇన్ కమ్ ట్యాక్ శాఖ ఆ డబ్బుకు సంబంధించి అన్ని లెక్కలు సక్రమంగానే ఉన్నాయనీ నారాయణగూడ పోలీసులకు స్పష్టంచేసింది. ఐటీ పరంగా ఆ డబ్బుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. పోలీసు శాఖ పరంగా అవసరమని భావిస్తే విచారణ చేసుకోవచ్చని తెలిపింది.
కాగా నారాయణ గూడ ఫ్లైఓవర్ వద్ద రూ.8 కోట్ల రూపాయల నగదుని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయ కార్యదర్శిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు ఆదేశాలతో తాను బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిననీ..మొత్తం రూ.8 కోట్లు అని కూడా తెలిపారు. ఎన్నికల్లో భాగంగా అంత పెద్ద మొత్తాన్ని తరలించపటం..ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నాడనే అనుమానంతో నారాయణ గూడ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో సదరు రూ.8 కోట్లకు ఇన్ కమ్ ట్యాక్ డిపార్ట్ మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది.
సామాన్యుడు లక్షల్లో డ్రా చేసుకోవాలంటేనే ముప్పతిప్పలు పెట్టే బ్యాంకులు రాజకీయ పార్టీలకు మాత్రం కోట్లలో నగదు విత్ డ్రా చేసినా ఎటువంటి అభ్యంతరాలు తెలిపటంలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.
Read Also : మొబైల్, వెబ్ వెర్షన్ : ‘Jio News’ యాప్ వచ్చేసింది